Monday, July 6, 2009

TAANAA, ATAA, NATS Avasaramaa manaki..


అందరికి వందనాలు. నేను ఈ పేజ్ క్రియేట్ చెయ్యటానికి ఒక చిన్న బాధ కారణం.

నేను అమెరికా లో పని చేస్తునాను. ఇక్కడికి వచ్చి 5 years అయ్యింది. ఈ 5 years లో నేను చూసిన లైఫ్, ఇక్కడి నుంచి ఇండియా / ఆంధ్ర లో జరిగే విషయాలు తెలుసుకుంటూ వాటిని చూడటం వింతగా ఉంది. ఇది అమెరికా లో ఉన్న మన వాళ్ళ అందరి పరిస్తితి అని నాకు తెలుసు. కానీ ఈ మధ్య ఒక విషయం చాలా బాధ కలిగించింది.

నాకు ఇండియా లో ఉన్నప్పుడు "తానా" వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు అంటే చాలా సంతోషం అనిపించేది. నేను కూడా అమెరికా వెళ్ళాక ఒక్క సారి అయినా ఆ సభలకి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మనకి ఒక్క "తానా" నే కాక "ఆటా" అని కూడా ఒక సంఘం ఉంది అని. సరే అమెరికా పెద్ద దేశం కదా అందరికి అందుబాటు లో ఉండటానికి ఇంకోక సంఘం ఉందేమో లే అనుకున్నాను. కానీ మొన్న మన ఆంధ్ర లో జరిగిన ఎలెక్షన్స్ కు ముందు ఇక్కడ జరిగిన విషయాలు కొన్ని చూశాక అవి నిజంగా మన కోసం మనం పెట్టుకున్నవి కావు అని అర్ధం అయ్యింది.

నేను డల్లాస్, అమెరికా లో ఉన్నాను కొన్ని నెలల ముందు. అక్కడ జరిగిన విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను.
ఆగస్ట్ లో అనుకుంటా డల్లాస్ కి చంద్ర బాబు గారు వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు అర్ధం కాలేదు వచ్చేముందు. కానీ డల్లాస్ కి వచ్చాక ఆయనకి జరిగిన ఏర్పాట్లు, కార్లా పెరేడ్, అభిమానులు, పెద్ద హోటెల్ లో సన్మానం చూశాక అర్ధం అయ్యింది.(మన్నించాలి ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెస్తున్నాను. ఎందుకు అంటే ఆది ఇక్కడ అవసరం కనుక). ఆది అంత ఒక కులం వాళ్ళు చేసిన హడావిడి అని. అందులో ఎక్కువ పంచుకున్న Dr.ప్రసాద్ గారు నాకు పరిచయం. ఆయన ని కలిసినప్పుడు అడిగాను ఇంత రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారా అని. లేదు అన్నారు. ఆయన తానా కి ఒకప్పుడు అధ్యక్షులు కూడా. అంత పెద్ద మనిషి కి కూడా అర్ధం కాలేదు ఇంత రెస్పాన్స్ ఎలా వచ్చిందో. కానీ తరువాత కొన్ని విషాయాలు తెలుసు కుంటే అర్దం అయ్యింది. అక్కడికి వచ్చిన మన వాళ్ళు అందరు కన్సల్టెన్సీస్ ఏర్పాటు చేసిన వాళ్ళు అని. ఏర్పాటు అంటే వేరే మీనింగ్ కాదు. ఒక కన్సల్‌టెన్సీ పెద్ద, ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకుని చంద్ర బాబు గారి తో మాట్లాడి టికెట్ పొందాలి అనుకున్నాడు. అందుకు చంద్ర బాబు గారి ట్రిప్ ని వాడుకున్నాడు. ఆయనది పెద్ద సర్కల్ డల్లాస్ లో. caste కూడా కలుస్తుంది. ఇంకెముంది ఆ రోజు ఆయనే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎంత వైభవం గా అంటే అమెరికా గవర్న్‌మెంట్ పర్మిషన్ తో పోలీస్ ఎస్కార్ట్,car's వెళ్లే దాకా ట్రాఫిక్ regularization. హోటెల్ లో పెద్ద సన్మాన సభ, అందరికి బోజానాలు. ఎంత మంది రక్తం పీల్చి సంపాదించిన సొమ్మో కానీ నీళ్ళాలా ఖర్చుపెట్టారు.

ఇక షికాగో లో మన చీఫ్ మినిస్టర్ గారికి సన్మానం, ఆటా వాళ్ళు ఏర్పాటు చేశారు. తానా వాళ్ళని చూసో ఏమో కానీ వాళ్ళు కూడా అదే తరహా లో, అంత కంటే ఎక్కువగా చేశారు. వచ్చినందుకు చంద్ర బాబు గారికి, YSR రెడీ గారికి కొన్ని కోట్లు సమర్పించి టికెట్స్ కోసం వెడుకుని వాళ్ళని సంతృప్తి పరిచి పంపించారు. ఆ తరువాత ఎలెక్షన్స్ . అంతా మీకు తెలుసు. ఎంత మందికి టికెట్స్ వచ్చాయో, ఎంత మంది ఇక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళు గెలిచారో తెలియదు. ఆది మనకి అనవసరం కూడా.. నేను చెప్పాదలిచినది వేరే ఉంది.

తానా ఒక్కటే ఉన్నది అమెరికా లో ఇంతకు ముందు. కానీ మన తెలుగు వాళ్ళ కి ఒక బుద్ది ఉంది. పీత కధ. పైకి పోతున్న పీత ని కింద పీత పట్టుకుని కిందకి లాగుతూ ఉంటుంది. రెండు అక్కడే ఉంటాయి, పైకి పోకుండా. తానా లో ఉన్న వాళ్ళు కొందరు ఎప్పటి నుండో అమెరికా లో ఉన్న డాక్టర్స్, ఇంజినీయర్స్. అందులో కొంత మంది కమ్మ వాళ్ళు ఉన్నారు. ఏమీ జరిగిందో తెలియదు కానీ రెడ్డి వాళ్ళు వేరే కుంపటి పెట్టారు ఆటా అని. అప్పటి నుండి ఆంధ్ర లో TDP Govt అధికారం లో ఉంటే తానా వాళ్ళు వెలిగిపోతారు ఇక్కడ, కాంగ్రెస్ ఉంటే ఆట వాళ్ళు వెలుగు తారు. మళ్లీ వాళ్ళలో వాళ్ళకే గొడవలు. ఇంత లో కొన్ని ఇతర కులాలు కూడా వల్ల సంఘాలు ఏర్పాట్లు చెయ్యబోతునట్లు వినికిడి.

ఇక తానా కాన్ఫరెన్స్ కి వద్దాం. ఇప్పుడు షికాగో లో జరుగుతున్న తానా సంబరాలు ఎందుకో ఎవరినా చెప్పగలరా? నేను మాత్రం ఒకటి అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం అమెరికా లో జరిగిన కొన్ని ఘోరాలు, హత్యలు, ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళని తానా, ఆట, నాట్స్ అందరు మర్చిపోయిన సంధర్భం గా చేసుకుంటున్న సంబరాలు లాగా కనపడుతుంది. పోయిన సంవత్సరం / ఈ సంవత్సరం షికాగో లో జరిగిన ఆక్సిడెంట్ లో మన తెలుగు వాళ్ళు 4 చనిపోయారు. వాళ్ళ Bodies recovery & ఇండియా కి పంపించటానికి జరిగిన ఏర్పాట్లు చూస్తే జాలి కలుగుతుంది. మనకి ఒక ఆర్గనైసేషన్ ఉంది కానీ మనవాళ్ళకి ఏది అయినా జరిగితే రెస్పాండ్ మాత్రం కారు. పోయిన సంవత్సరంఅమెరికా లో నే ఒక 4 ఆంధ్ర వాళ్ళు హత్య చెయ్యబడ్డారు. ఏ ఒక్క కేసు లో కూడా మన తానా కానీ ఆట కానీ గట్టిగా నిలబడి పోరాడాలేదు. కానీ వాటికి ఉన్న పవర్ ఎంత అంటే బిల్ క్లింటన్ కూడా వీళ్ళ సభలకి అటెండ్ అయ్యారు. ఇక మనకి దేనికోసం కావాలి వీళ్ళు? ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రూప్ సభలు జరుగుతాయి. ఈ సారి తానా వాళ్ళు చేస్తున్నారు. వాటికి మన ఆంధ్ర మినిస్టర్ లు, శాసన సభ్యులు, సినిమా వాళ్ళు వస్తారు. ఎందుకు? సినిమా వాళ్ళు రోజు ఏదో ఒక సినిమా లో చేసే కామెడీ నే చేస్తారు మినిస్టర్ లు, శాసన సభ్యులు ఇక్కడికి వచ్చి కూడా అవే ఆరోపణలు. ఇక వేరే కార్యక్రమాలు అంటే ఇక్కడ అమెరికా లో AR రెహ్మాన్ కాన్సర్ట్ లాంటివే జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. బాలు గారు,ఏసూదస్ గారు, శివ రెడీ గారు, విజయలక్ష్మి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలా అందరు ఏదో ఒక టైమ్ లో ఏదో ఒక ఊరిలోకాన్సర్ట్స్ ఇస్తున్నారు. వేరే ఏదెనా కొత్తదనమా అంటే అదీ లేదు. ఇక్కడికి వచ్చే సినిమా వాళ్ళు కూడా అందరు మన వాళ్ళా అంటే అదీ కాదు. ఇల్లియానా, నయనతార, శ్రీయ ఇలా తెలుగు మాట్లదని వాళ్ళు ఇక్కడికి తానా, ఆటా, నాట్స్ సభలకి వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ సభలకి ఆహ్వానం పొందటానికి ఆంధ్రా లో ఉన్న కొంతమంది డబ్బులు ముట్ట చెపుతారు ఆట ఇక్కడ ఉన్న మన వాళ్ళకి. ఆది కూడా ఒక వ్యాపారమే.
తానా, ఆటా, నాట్స్ వాళ్ళు తెలుగు ని ప్రమోట్ చెయ్యటం అన్నది ఒక ట్రాష్. అక్కడికి వచ్చిన వాళలో చాలా మంది ఇంగ్లీష్ లో నే మాట్లాడతారు. ఇక వీళ్ళు వాగే చెత్త అంత ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరుగుతున్న మన next generation కి ఏమీ అర్ధం కాదు. తెలుగు ఇక్కడ మన పిల్ల ల మధ్య నిలబడుతుంది అంటే పేరెంట్స్ చేసే కృషి ఒక్కట్టే కారణం. వాళ్ళకి తెలుగు క్లాస్సులు, మన పాటలు, సంగీతం నేర్పించటం ఇలా ఎన్నో చేస్తున్నారు మన వాళ్ళు. అలాంటివి ఏమీ ఉండవు ఆ సభల్లో. ఈ సభలు ఎంత ఖర్చుతో కూడుకున్న పనో ఇది మనకి అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం చేసేఖర్చుతో ఒక ఊరు మొతం బాగు చెయ్యవచ్చు. ఎంతో మందికి చదువు కి కావలసిన డబ్బులు ఏర్పాటు చెయ్యవచ్చు, ఎందరికో ఇతర రకాలు గా హెల్ప్ చెయ్య వచ్చు. కానీ ఇవేమీ పట్టవు వాళ్ళకి. కానీ వాళ్ళ వెబ్‌సైట్ లో మాత్రం

* To help the homeless and the needy with food, health care and shelter.
* to provide emergency help to needy telugu students and lonely visitors.

ఇందులో ఒక్కటన్నా జరుగుతున్నాయా? కొన్ని జరుగుతున్నట్టు వినిపిస్తారు కధలు కానీ నిజం కాదు. వీళ్ళ కంటే ఇక్కడ యూనివర్సిటీస్ లో ఉన్న మన సీనియర్ స్టూడెంట్ ఆర్గనైసేషన్స్ చాలా బెటర్. ఏ అవసరం అయినా వెంటనే హెల్ప్ చేస్తారు. ఇక మన లోకల్ లో ఉన్న మన తెలుగు ఆర్గనైసేషన్స్ కూడా చాలా బెటర్ ఆ విషయం లో. ఒక example ఇక్కడ . మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ మధ్య డల్లాస్ లో చాలా దొంగతనాలు జరిగాయి. అన్ని మన తెలుగు వల్ల ఇళ్లలోనే. అందులో ఒక ఫ్రెండ్ ఉంది. వాళ్ళ ఇంట్లో దొంగలు మొత్తం దోతుకుని వెళ్లారు. పోలీస్ కి కంప్లేంట్ ఇస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు. మీకు రెంటర్స్ ఇన్షురెన్స్ ఉంటే క్లేమ్ చేసుకోండి అని మాత్రం చెప్పారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి డల్లాస్ లో. కానీ ఒక్క ఆర్గనైసేషన్ కూడా ఇటు తిరిగి చూడలేదు, దాని గురించి మాట్లాడలేదు. తోటకూర ప్రసాద్ గారు అని డల్లాస్ లో ఒక పెద్దాయన ఉన్నారు డల్లాస్ లో మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన మాత్రం అక్కడ లోకల్ రేడియో లో అనౌన్స్మెంట్ చేశారు ఇలా జరుగుతున్నాయి అని. అదృష్టం కొద్ది ఆ దొంగతనాలు చేస్తున్న వాళ్ళని పోలీస్ లు ఎక్కడో పట్టుకున్నారు కాబట్టి సరి పోయింది కానీ లేక పోతే ఇలా రోజు ఎక్కడో ఏదో జరుగుతుంది అని భయపడుతూ ఉండాలిసిందే. ఆ దొంగతనాలు చేసే వాళ్ళు తెగిస్తే జరిగే ఘోరాలకి జవాబు ఏది? అప్పుడు కూడా ఈ ఆర్గనైసేషన్స్ ఏమీ చెయ్యవు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.
నాట్స్ అని ఒక కొత్త ఆర్గనైసేషన్ పుట్టింది. అదేదో కొత్తది అనుకునేరు. మన తానా లో జరిగిన గొడవ ల వల్ల పుట్టిన అక్రమ సంతానం ఆది. ఆధిపత్య పోరు పెరిగి కోర్టు లో కూడా కేసు వేసుకుని చివరికి ఇలా వేరు అయ్యీ ఇంకో కొత్త అవతారం లో వచ్చి మనలని దోచుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ సారి సభలు పెట్టారు. ఇక మన ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళకి ఇంకో అవకాశం. తానా , ఆట, నాట్స్ ఏదో ఒక సభ జరుగు ఉంటుంది ప్రతి సంవత్సరం. డబ్బులు నీళ్ళ లాగా ఖర్చు అవుతూనే ఉంటాయి కానీ దాని వల్ల జరిగేది మాత్రం శూన్యం.

గమనిక : ఇందులో ఏదో ఒక కులం, మతం వాళ్ళని కించ పరచాలని మాత్రం నా ఉద్దేశం కాదు.

5 comments:

Gunda said...

Nijam boss nenu inni rojulu amerikalo sabalu ante pedalaki help cheyadam anukunnanu. kani meeru cheppina taruvatha telisindi entha goram jaruguthundo. Meeku danyavadamulu

శరత్ చంద్ర said...

చాలా చక్కగా చెప్పారండి.. కులం పేరుతో స్నేహాలు, కులం పేరుతో సంఘాలు చివరికి కులం పేరుతోనే ఎన్నికలు కూడా.

చచ్చేదాక కులం కులం అని కొట్టుకు చస్తారు.

మీ బ్లాగు చాలా బావుందండి. H1 ప్రాససింగ్ లో కన్సల్టెన్సీస్ ఎంత ఘోరంగా వ్యవహరిస్తారో ఇదివరకే తెల్సు, మీ టపా ద్వారా మరింత తెల్సుకున్నాను.

కృతజ్ఞతలు

శరత్ చంద్ర

గోపాల్ said...

ఇన్నాళ్ళు అవేవో కనీసం సాంస్కృతిక కార్యక్రమాలతో భారతీయ జీవన విధానాన్ని మరిచి పోకుండా చేస్తున్నవేమోనని అనుకునేవాడ్ని.

Anonymous said...

Please check www.manavata.org to help others.

Anonymous said...

What you said is corrector large extent, but how can you be so naive to think anybody will do something in THAT scale only for charity! Mundu kulalu putte mannish puttadu, if you see the history of our Telugu people at least. Manavallu anevallu Asalu leru, undaru kuda.