Monday, July 6, 2009

mana desi consultancies gurinchi...


ఈ రోజు నేను రాయ బోయే విషయం మన వాళ్ళు నడిపే కన్సల్టెన్సీస్ గురించి.

నేను H1 మీద అమెరికా లో ఉంటున్నాను ఒక 5 yrs నుంచి. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టి కొన్ని రోజులు ఇండియా లో జాబ్ చేసి ఒక సారి అమెరికా లో కూడా ఏముందో చూద్దాం అనుకుని ఒక ఫ్రెండ్ ని హెల్ప్ అడిగాను ఎవరినా H ప్రోసెస్ చేస్తారా అని. తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ కి చెప్పి నా అప్లికేషన్ ప్రోసెస్ చేశారు. కొన్ని వీసా కష్టాలు, ఏడుకొండల వాడి దర్శనం తరువాత కొంచం కష్ట పడితే వీసా వచ్చింది. ఇక్కడికి రాగానే ఫ్రెండ్ ఇంట్లో ఉంది ఒక 2 నెలలు తరువాత జాబ్ లో చేరాను. అప్పటికీ నాకు ఇక్కడ కన్సల్‌టెన్సీ ల గురించి పెద్దగా తెలియదు. ఇక్కడికి వచ్చాక కొన్ని ఫార్మొలేటీస్ అయ్యాక జాబ్ వేట లో పడ్డాను. ముందు Resume Prepare చేసి మార్కెట్ లో కి వదిలి కాలు మీద కాలు వేసుకుని మనకి ఉన్న experience కి వాళ్లే పిలిచి జాబ్ ఇస్తారు లే అని అనుకున్నాను. కానీ ఒక 3 రోజులకీ ఏమీ రెస్పాన్స్ లేకాపోయే సరికి కొంచం షాక్ కొట్టి నేనే Dice, Mosnter లాంటి వాటిల్లో లో resume పెట్టాను. పర్వాలేదు కొన్ని కాల్స్ రావటం మొదలు అయ్యాయి. అప్పటికీ ఇంకా నాకు అమెరికా లో ఇంత మంది మన వాళ్ళు కంపనీస్ నడుపుతున్నారు అని తెలియదు. నాకు వచ్చిన ఒక కాల్ ఎత్తగానే ఒక ఆవిడ మాట్లాడుతూ "యూ నో C++ అన్నది", వచ్చు అన్నాను, "యూ నో Java" అన్నది, ఈ లిస్ట్ అంత ఎందుకు డైరెక్ట్ గా పాయంట్ కి వద్దాం అని నాకు 8 yrs ఎక్స్‌పీరియెన్స్ ఉంది C++,జావా,J2EE అండ్ ఇంటెర్నెట్ టెక్నాలజీస్ మీద అన్నాను. తాను మళ్లీ "యూ నో Java" అన్నది. సరే లే గొడవ ఎందుకు అని వచ్చు అన్నాను, అలా ఒక 10 టెక్నాలజీస్ మీద యూ నో అని లాస్ట్ కి Do you have కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది. నాకు అర్ధం కాలేదు. అంటే అని నేను తిరిగి అడిగాను. Do you have కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మళ్లీ. మరి నేను మీతో ఇప్పటిదాకా మాట్లాడిన దానిని ఏమంటారు అన్నాను. ఈ వాంట్ ఆన్సర్స్ ఇన్ Yes or NO అన్నది. సరే లే గొడవ ఎందుకు, అవసరం మనది కదా అని yes అన్నాను. How do you rate your self in కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ 1 - 10 అన్నాను. మనం మాట్లాడే బాష ని మనమే కొలుచుకోవటం ఎంతో అర్ధం కాక పోయినా నేను 8 / 10 అన్నాను. "Can i say 9.5/10" అన్నది. నాకు అర్ధం కాలేదు. మనం మాట్లాడే బాష కి 9.5 ఎలా విలువ కడతారో. సరే నీ ఇష్టం అన్నాను. Can you explain some thing about you అన్నది. ఎక్కడో నేర్చుకున్న ఒక చిన్న essay ని ఒప్ప చెప్పాను. ఓక్ అని క్ల్లెంట్ కి పంపిస్తాను, you can expect a కాల్ ఫ్రమ్ మిస్టర్. రెడీ అన్నది. అప్పటికీ కానీ నాకు అర్ధం కాలేదు నన్ను ఇన్ని క్వెస్చన్స్ అడిగిన ఆవిడ ఒక లేయర్ అని. సరే లే అనుకున్నాను. ఒక గంట తరువాత ఆ మిస్టర్.రెడీ కాల్ చేసి మళ్లీ అవే ప్రశ్నలు రిపీట్ చేశాడు. అన్ని అయ్యాక నేను మా client ki ఫార్వర్డ్ చేస్తాము, expect a కాల్ ఫ్రమ్ them అన్నాడు. సరే లే అనుకుని ఎదురు చూస్తూ ఉంటే ఒక అమెరికన్ కాల్ చేసి 5 నిమిషాల్లో లో సో & సో client కి ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పాడు. client కి వెళ్లే సరికి ఒక రోజు అయ్యింది. అలాగే ఇంటర్‌వ్యూ సెట్ అయ్యింది, అక్కడ కూడా మన దేశీ నే కాల్ చేసింది. టెక్నికల్ గా సౌండ్ అనుకుంటా బంతి ఆట ఆడుకుని వీడికి అంత సీన్ లేదులే అనుకుని ఒక గంట తరువాత వదిలేసాడు. అప్పటికీ కానీ నేల కనపడలేదు. ఇక మళ్లీ స్టార్ట్ చేశాను జాబ్ వేట. సరే కొన్ని రోజులకీ ఇక్కడి వాతావరణం, భాష కొంచం అలవాటు అయ్యీ కొంచం కంగారు తగ్గించుకుని ఒక ఇంటర్‌వ్యూ కొట్టాను. మళ్లీ కొంచం భూమి పైన నడవటం స్టార్ట్ చేశాను. మనకేంటి లే ఇంకా లైఫ్ సెట్ అన్న ధీమా. కానీ ఒక గంట తరువాత కానీ నాకు అర్ధం కాలేదు ఆది ఎంత తప్పో. ఈ ఇంటర్‌వ్యూ కి కూడా 2 లేయర్స్ మా ఎంప్లాయర్ కాకుండా. ఒకరి దగ్గరి నుంచి మా ఎంప్లాయర్ కి పేపర్స్ వచ్చి అన్ని సెట్ అయ్యాక కానీ అర్ధం కాలేదు రేట్ ముందే మాట్లాడుకోవాలి అని. తీరా అక్కడి దాకా వచ్చాక తెలిసింది నేను పని చెయ్యబోయేది పల్లీలు(పీనిట్స్) కొన్నుక్కో టానికి కూడా పనికి రాదు అని. ఎంత ట్రై చేసినా ఎవరు ఒప్పుకోలేదు వల్ల ప్రాఫిట్ తగ్గించుకోటానికి. సరే లే అని జాబ్ లో చేరాను. అక్కడ ఒక దేశీ ఫ్రెండ్ తగిలాడు. నా గోడు అతనికి చెప్పాను ఇలా తక్కువ కి పని చేస్తున్నాను అని, కానీ అతను తన స్టోరీ చెప్పాక అర్ధం అయ్యింది. రోలు వెళ్ళి రోకలితో మొర పెట్టుకుంది అని. నాకంటే దారుణం అతని పరిస్తితి.

అప్పుడు స్టార్ట్ చేశాను కన్సల్టెన్సీస్ గురించి తెలుసుకోవటం. మన దేశీలు నడిపే వాటి గురించి. నమ్మలేని నిజాలు అనేవి ఏవి అయినా ఉంటే అందులో ఇవి కూడా ఒకటి.

మన వాళ్ళు అమెరికా కి రావటం ఎక్కువగా 1996-2000 మధ్య లో స్టార్ట్ అయ్యింది. ఆ రోజుల్లో ఇంటర్మీడియేట్ ఫేల్డ్ కూడా ఒక 15 డేస్ క్ర్యాష్ కోర్స్ చేసి అమెరికా కి వచ్చారు. అవసరం అలాంటిది అప్పుడు ఇక్కడ. అలా వచ్చిన వాళ్ళలో కొంత మంది బతక నేర్చిన వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసి వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్చుకుని ఇక్కడ ఉన్నలూప్ హోల్స్ ని పట్టుకుని చిన్న చిన్న గా సెట్ అయ్యారు. అలా అని అన్ని కన్సల్‌టెన్సీ వాళ్ళు తక్కువ చదువు కున్నా వాళ్ళు కాదు. BTECH,MS చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కన్సల్‌టెన్సీ పెట్టక ఇక్కడ ఉన్న జనాల కొరత ని అర్ధం చేసుకుని ఇండియా లో ఉన్న మన వాళ్ళకి హ్1 లు చేసి ఇక్కడికి రప్పించటం స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కొన్ని కన్సల్టెన్సీస్ లో 100+ మంది ఉన్నవి చాలా ఉన్నాయి. వాటి మంత్లీ ప్రాఫిట్స్ ఎంత లేదు అన్న $200,000+ ఉంటుంది. చూడండి మన ఇండియన్ రుపీస్ లో దాని వ్యాల్యూ. కోట్లు సంపాదించారు.

మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటే పర్వాలేదు, వ్యాపారం అనుకున్న కొంచం ఎతిక్స్ ఉన్న పర్వాలేదు. అసలు అమెరికన్ కంపనీస్ ఎప్పుడు వీసా ప్రోసెస్ చెయ్యటానికి డబ్బులు అడగవు కానీ మన వాళ్ళు లాయర్ ఖర్చుల దగ్గరి నుంచి అన్ని కట్టించుకుంటారు. ఒక $1800 నుంచి $2000 అవ్వ వలసిన దానికి $3000 తీసుకుంటారు. సరే లే మనకి అమెరికా వెళ్ళటం కదా ముఖ్యం అనుకుని మనం కట్టేసి పేపర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చేస్తే కొన్ని కన్సల్టెన్సీస్ మీద ఉన్న కేస్ ల వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే వీసా కి వెళితే రిజెక్ట్ అవుతుంది కంపనీ మంచిది కాదు అని, ఇక అవతల కంపనీ వాళ్ళు ఎంత కాల్ చేసినా మేల్స్ పెట్టిన రెస్పాండ్ ఆవ్వరు. కొంతమంది అన్ని శకునాలు దాటుకుని అమెరికా లో అడుగు పెట్టగానే కన్సల్‌టెన్సీ వల్ల గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళతారు. అందులో ఏ లోపం ఉండదు పాపం. వెళ్ళాక నాలాగే జాబ్ సర్చ్ స్టార్ట్ చేస్తారు. చాలా సార్లు వల్ల కి వచ్చే కాల్స్ అన్ని కూడా ఎంప్లాయర్ దగ్గర ఫిల్టర్ అయ్యకే వస్తాయి. సో ఎట్టి పరిస్తితుల్లో కూడా రేట్ ఎంతో చెప్పారు. ఇక్కడికి వచ్చాక 70%-30% కావాలా జీతం కావాలా అని ముందే అడుగుతారు. జీతం అంటే ఎక్కడ తక్కువ వస్తుందో అని 70%- 30% అంటాము ఆశ చావాక. అక్కడే పప్పులో కాలు వేసేది. ఎలాగూ రేట్ తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్ మీద 70% అంటారు. ఇంకా ఘోరం ఏంటి అంటే కొన్ని సార్లు సర్విస్ ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని అందులో నే కలుపుతారు. ఇక మనం జాబ్ లో చేరగానే ఎలాగూ మనకి తెలుస్తుంది మన కి ఎంత పే చేస్తున్నారో క్లైంట్, తెలిసినా ఏమీ పీక లేము ఎందుకంటే మన H1 వల్ల చేతుల్లో ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మన రక్తాన్ని పిండటం. H1 ఎక్స్‌టెన్షన్స్ కి మనమే కట్టాలి డబ్బులు. paid leaves ఎలాగూ ఉండవు. కొంత మంది బెంచ్ లో మినిమమ్ కూడా పే చెయ్యరు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎంత కష్టమో వాళ్ళకే తెలుసు. ఈ మధ్య బయట జాబ్స్ కష్టం గా ఉండటం వల్ల గెస్ట్ హౌస్ అనే ఫేసిలిటీ ని కూడా తీసేసారు. రెండు లేక మూడు నెలలు జాబ్ లేక పోతే ఇండియా కి వెళ్ళిపొమ్మంటున్నారు. ఎంతో మందికి H1 రివోక్ కూడా చేశారు.

ఇక గ్రీన్ కార్డు మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి అదొక పెద్ద నరకం. అందులో అన్ని మనమే పెట్టుకోవాలి. ఒక $6000 కావలిసిన దానికి ఎంత లేదు అన్న $8000 చేస్తారు మన కన్సల్‌టెన్సీ వాళ్ళు. సరే ఏదో అయ్యింది అనుకున్న అమెరికా వాళ్ళు అంత తేలికగా లా లేరు గ్రీంకార్డ్స్. ఎంత లేదు అన్న మినిమమ్ 5 పడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.మన వాళ్ళు ఎంత సిద్దాహస్తులో. నాకు తెలిసిగ్రీన్ కార్డ్ ఒక పెద్ద విష వలయం. ఒకే లేబర్ ని 25 మందికి అమ్ముకుని డబ్బులు చేసుకున్న ధౌర్భాగ్యులు ఉన్నారు. ఒక ఈ140 ని చాలా మందికి అమ్ముకుని కోట్లు సంపాదించారు. మొన్న వెలుగు చూసిన ఒక కేసు లో కి వెళితే బోస్‌టన్ లో మన వాళ్ళు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. నేను పైన చెప్పిన వి అక్కడే జరిగాయి. ఇన్ని ఘోరాలు చేసిన ఒక పెద్ద మనిషి ఇంటికి ఒకసారి నేను వెళ్ళాను. ఇల్లు కాదు ఆది ఇంధ్ర భవనం అనాలి. ఇంట్లో ఉన్న వి అన్ని గోల్డ్ ప్లేటెడ్ అంటే ఎంత వైభవమో ఆలోచించండి. దిగితే Lexus or BMW, Business class flight ,ఇండియా లో ఎక్కడికి వెళ్ళినా రాజా భొగం, ఎన్నో చారిటీ వేషాలు ఇండియా లో. తీరా ఇక్కడ అధికారులు కొన్ని నిజాలు తెలుసుకుని ఆ కన్సల్‌టెన్సీ ని క్లోస్ చేశారు. కన్సల్‌టెన్సీ ఇద్దరి పేరు మీద ఉంది, అతను అతని వైఫ్ ని జైల్ లో పెట్టారు. అతని కన్సల్‌టెన్సీ ద్వారా గ్రీన్ కార్డ్ పొందిన వాళ్ళని కూడా బ్ల్యాక్ లిస్ట్ లో పెట్టారు. పాపం కొందరు తెలియక కూడా అందులో కూరుకున్నారు. ఇంకా పాపం ఏంటి అంటే వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు అమెరికా కస్టడీ లో ఉన్నారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనక కాలువ లో పడి చచ్చినట్టు ఉంది వల్ల పరిస్తితి.

జాబ్ ఒక దగ్గర చేస్తూ LCA ఇంకో దగ్గర చెయ్యటం, జాబ్ ఇంటర్‌వ్యూ కోసం ఫోన్ ఫార్వర్డింగ్, వాళ్ళ క్యాండిడేట్ కి హెల్ప్ కోసం వేరే వాలని ముందు ఇంటర్‌వ్యూ కి పంపించి క్వెస్చన్ ప్యాటర్న్ తెలుసుకోవటం, ఒకే కంపనీ 2 లేక 3 లేయర్స్ కింద పెట్టి అసలు క్యాండిడేట్ కి తక్కువ ఇవ్వటం, కొందరు clients పే చేసే వరకు పే చెయ్యక పోవటం, చెప్ప పెట్టా కుండా కొన్ని నెలలు జీతం ఇవ్వక పోవటం ఇలా చాలా ఉన్నాయి మన వల్ల కళలు.

ఇంకో కేసు లో ohio లో ఉన్న ఒక అమెరికన్ గవర్న్‌మెంట్ ఎంప్లాయీ కి మన వాళ్ళు ఆశ చూపి అతని దగ్గర కొన్ని లెటర్ హెడ్స్ మీద సంతకాలు తీసుకుని వాళ్ళ కన్సల్టెన్సీస్ లో హ్1 వచ్చిన వాళ్ళకి క్లైంట్ లెటర్ కింద అవి ఇచ్చారు. మన వాళ్ళు వెళ్లేది చెన్నై కన్సల్‌టెన్సీ కి. అసలే వాళ్ళు పెద్ద మూదుర్లు. మన హైదరాబాదు వాళ్ళతో సహవాసం చేసి ఎలాంటి తప్పు అయినా తేలిక గా పట్టుకునే స్టేజ్ కి ఎదిగారు. అమెరికన్స్ ప్రకారం చెన్నై కన్సల్‌టెన్సీ లో జరిగిన అంత పరీక్ష వేరే ఏ దేశాల్లో జరగదు ఆట, ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో లో కూడా. వాళ్ళకి ఈ మోసం తెలిసి ట్రాప్ వేసి అందరినీ పట్టుకున్నారు. ఇక ఇప్పుడు అందరి పరిస్తితి కుడితి లో పడ్డ ఎలుక లా అయ్యింది మన వాళ్ళు చేసిన తప్పులకి. అసలే రిసెషన్ అందులో ఇలాంటి తప్పులు దొరికే సరికి టైట్ చేశారు అమెరికా వాళ్ళు.

ఎంతో మంది మీద కేసు లు వేశారు ఇప్పుడు. చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు కొందరు, మిగిలిన వాళ్ళు భయ భయపడుతున్నారు ఎప్పుడు వాళ్ళవంతు వస్తుందో అని. ఇక ఇంకో విషయం ఏంటి అంటే అమెరికా వాళ్ళు టెస్టింగ్ జాబ్ కి తేచింకాల్ ఎక్స్‌పీరియెన్స్ అవసరం లేదు అని మార్చారు. అంటే దానికి హ్1 ఉండవలసిన పని లేదు. ఇక్కడ 10+ చదువు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుని టెస్టింగ్ జాబ్ చేయ వచ్చు. ఇలా కొన్ని జాబ్స్ ని అలాంటి కెటెగరీ లో కి పెట్టటానికి ఆలోచిస్తున్నారు ఆట. ఆది కూడా మన వాళ్ళ కి పెద్ద దెబ్బ. ఇక ఒక కంపనీ కి H1 మీద వచ్చి వేరే కంపనీ కి కన్సల్టెంట్స్ గా పని చెయ్యకూడదు అని ఒక రూల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆట.ఆది కానీ జరిగితే ఇక H1 మీద ఉన్న వాళ్ళు అందరు దుకాణాలు ఎత్తి ఇండియా వెళ్ళవలసిందే.

ఇంత చెప్పిన నేను మాత్రం ఈ విషయం లో కొంచం హ్యాపీ. మా ఎంప్లాయర్ డబ్బులు తీసుకోరు H1 కి, ext కి. కొంచం నిజాయితీ గా ఉంటారు.

3 comments:

Unknown said...

nice story
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

Telugu Vilas said...

good Article thanks for sharing Teluguvilas

Telugu Vilas said...

good Article thanks for sharing Teluguvilas