Monday, July 27, 2009

కార్గిల్ వీరుల గుర్తు గా..

కార్గిల్ వీరుల గుర్తు గా..

మన సైన్యం గురించి రాసే అంత పెద్ద వాడిని కాదు. కానీ కార్గిల్ యుధం జరిగిన తరువాత ఒక 2 సంవత్చరాలకి ఒక మైల్ వచింది. ఆది గుర్తుకు వచ్చింది.

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు,( మనకి బాగా ఇష్టమయన బ్రహ్మి అనే పేరు పెడదాం), ఇంకొక వ్యక్తి పేరు విక్రమ్. ఇద్దరు బెంగుళూరు నుంచి డిల్లీ కి రాజధాని లో బయలుదేరారు. ఇద్దరు ఎదురు ఎదురు బెర్తులు. బండి బయలుదెరగానే ఇద్దరు పలకరించుకున్నారు. మన బ్రహ్మి ఒక మంచి కంపనీ లో మంచి పొసిషన్ లో ఉన్నాడు. సామాన్యం గా అయితే ఫ్లైట్ లో వెళ్ళవలసింది కానీ టికెట్ లు దొరకక ఇలా బయలుదేరాడు. ఆ కోపం ఉంది తనకి మనసులో. ఇక అవతల వ్యక్తి ఘంభీరం గా ఉన్న మంచి సమయాస్పూర్తి తో అందరినీ కలుపుకుని వెళుతున్నారు. కొంచం దూరం వెళ్ళగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. ఏసీ ట్రేన్ అంటే బయట ప్రపంచం తెలియదు. ఇక మన విక్రమ్ గారికి కొంచం బోర్ కొట్టి మన బ్రహ్మి తో మాటలు కలిపారు. అప్పటికే మన బ్రహ్మి తన ల్యాప్‌టాప్ లో తల పెట్టి ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. విక్రమ్ గారు మాట్లడించాలా లేదా అని అనుకుని "మీ పేరు?" అన్ని అడిగారు. మన వాడు తన పేరు తో పాటు పలానా కంపనీ లో తన పోస్ట్ కూడా చెప్పాడు. విక్రమ్ కి అర్ధం కాక వాళ్ళు ఏమీ తయ్యారు చేస్తారు అని అడిగారు. అందుకు మన వాడు సాఫ్ట్‌వేర్ తయ్యారు చేస్తారు అన్నాడు. ఆయనకి ఇంకా అర్ధం కాలేదు. వివరం గా చెపుతారా అన్నారు. అందుకు మన వాడికి కొంచం కోపం వచ్చి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో కూడా తెలియని వాడికి మొత్తం చెప్పాలి అంటే కొంచం బాధ పడ్డ మన గొప్పదనం చెప్పుకుందాం అని మొదలు పెట్టాడు. "మేము కంప్యూటర్ ని వాడి సాఫ్ట్‌వేర్ తయ్యారు చేస్తాము. ఆది ప్రపంచం లో ఉన్న వాళ్ళకి అమ్ముతాము. ఇంకా వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ పనులు కూడా చేసి పెడతాము. అందుకు మా కంపనీ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు." అని అన్నాడు. మన విక్రమ్ గారికి కొంచం అర్ధం అయ్యింది. ఆయన మళ్లీ మన వాడిని మీకు మంచి జీతాలు ఉంటాయి అనుకుంటా అన్నారు. మన వాడికి కొంచం కోపం వచ్చి మేము కష్ట పడే దాంట్లో మాకు వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ అన్నాడు. దానికి విక్రమ్ గారు మీరు అంత కష్ట పడతారా అన్నారు. ఆ మాట తో మన వాడికి బాగా కోపం వచ్చి "కంప్యూటర్ అంటే ఏంటో తెలియని మీకు ఇవన్ని అర్ధం కావు. మేము ఒక ప్రాజెక్ట్ లో పని చేసి క్లైంట్ కి తగ్గట్టు అన్ని పనులు చేసి, మధ్యలో వాళ్ళు ఏది అయినా మార్పు చేస్తే వాటిని కూడా అమలు చేసి ఇవ్వాలి. ఇది అంతా క్లైంట్ ఇచ్చిన టైమ్ లో నే చెయ్యాలి. రోజు మీటింగ్ లు, ఇంట్లో ఉన్నా ఫోన్ లు, వారాంతం లో కూడా పని, రోజు 10 -12 గంటలు పని, క్లైంట్ కి ఏదెనా నచక పోతే వాళ్ళు తిట్టే తిట్లని కూడా మేమే భరించాలి. మీకు ఆ "లైన్ ఒఫ్ ఫైయర్" అర్ధం కాదు, చెప్పినా అర్ధం చేసుకోలేరు" అన్నాడు ఆవేశం గా. అందుకు మన విక్రమ్ గారు అయ్యో మీకు కోపం వచినట్టున్నది. మన్నించండి. నిజమే మీరు అన్న "లైన్ ఒఫ్ ఫైయర్" కి మీరు చెప్పిన అర్ధం నాకు తెలియదు. నాకు తెలిసిన అర్ధం వేరు. ఆది ఎంతో చెపుతాను వినండి. ఒక 100 మంది కలిసి ఒక ఎత్తు అయిన కొండ ని కాపాడాలి అన్న అధికారుల ఆదేశం తో బయలుదెరాము మేము. మాతో పాటు మా క్యాప్టన్ కూడా ఉన్నారు. ఆ కొండ అవతల ఎంత మంది ఉన్నారో తెలియదు. చిమ్మ చీకటి. ఆ కొండ ఎక్కటం చాలా కష్టం. ఆది నిట్ట నిలువు గా ఉంది. పైగా వర్షం. కానీ తప్పదు. ఎంతో ముఖ్య మైన పని అయితే తప్ప మమ్మలని పంపించారు. అందుకే అందరమూ ఆ పని ఎలాగా అయినా పూర్తి చెయ్యాలి అని బయలుదేరాము. ఆ కొండ కిందకి రాగానే పై నుంచి రాళ్లు కింద పడసాగాయి. కొంచం పైకి వెళ్ళగానే ఎక్కడినుంచో ఒక బాంబ్ మామధ్య లో పడింది. అంతే ఒక 10 మంధీ అక్కడికక్కడే చనిపోయారు. మా కళ ముందే అంత మంచి చనిపొయినా చలించ లేదు. ఇంకా కొంచం జాగ్రత గా ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాము. అప్పుడు అర్ధం అయ్యింది కొండ అవతల వైపు శత్రువులు ఎక్కువ సంఖ్య లో నే ఉన్నారు అని. మేము పై అధికారులకి సమాచారం ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రాత్రి కి ఏ సహాయము అందదు, అలానే ఉండాలి రేపు ఉదయానకి సహాయం పంపిస్తాము అన్నారు. ఇంకా ఆ రాత్రికి గడవటానికి 6 గంటలు సమయం ఉంది. అవతల నుంచి బాంబుల వర్షం కురుస్తుంది. ఏదో ఒక రకం గా వాటిని తప్పించుకుంటూ ముందు కి వెళుతున్నాము. కొంచం పైకి వెళ్ళగానే ఆ ప్రదేశం నుంచి అవతల శత్రువుని కొంచం చూడటానికి వెసులు బాటు ఉంది. ఎంత మంది ఉన్నారో అని చూస్తే ఒక పెద్ద సైన్యమే ఉంది పైన ఉన్న వాళ్ళకి సహాయం గా అక్కడ. వాళ్ళని నిలువరించటం అక్కడ మిగిలిన 50 మంది వల కాదు కానీ తప్పదు ప్రాణాలు పోయినా తప్పదు. ముందు కి కదిలాము మిగిలిన వాళ్ళు అందరమూ. అలా కొంచం పైకి వెళ్ళి పెద్ద పెద్ద బండల చాటున ఉన్నాము. ఇక మిగిలినది కొంచం ఎత్తు అయినా శత్రువు కు అప్పటికే ఆ ఎత్తు లో ఉన్న ఉంది. వాళ్ళని మట్టు పెట్టాలి అంటే వాళ్ళని దొంగ దెబ్బ తీయ్యాలి. అందుకు మిగిల వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టారు. ఒక్కో జట్టు ఒక్కొక్క వైపు నుంచి అవతల కొండ మీద ఉన్న శత్రువుని చావు దెబ్బ కొట్టటం అన్నది ప్లాను. అలానే ముందు కి వెళుతున్నాము. కానీ పైనుంచి పడుతున్న బాంబులు మాలో చాలా మందిని చంపేశాయి. అలా నే కష్ట పడి 3 జట్ల లో ఒక జట్టు అందరినీ తప్పించుకుని శత్రువు ముందుకి వెళ్ళి ఒక ప్రదేశం లో ఉండగలిగారు. వాళ్ళు ఇచ్చిన సందేశం తో మిగిలిన జట్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మిగిలింది అవతలి శత్రువు ని మట్టు పెట్టటం. ఆ రాత్రి కి ఇంకా 3 గంటలు సమయం ఉంది. మాలో మిగిలింది 22 మంది. అయినా సరే మొండి ధైర్యం తో పోరాటం మొదలు పెట్టాము. మా క్యాప్టన్ కూడా మాతో పోరాడుతూ మమ్మలిని ఉత్తేజ పరుస్తూ శత్రువుని చీల్చి చెండాడుతూ ఉన్నారు. ఇంతలో మాదగ్గర ఉన్న ఆయుధాలు అయిపొసాగాయి. ఆది తెలిసి అవి అయిపోతే అవతలి శత్రువు మా అందరినీ చంపేస్తారు అని అనుకుని మాలో ఉన్న ఒక అతను ఎదురు శత్రువు శిభిరామ్ లో కి పరుగెత్తి చేతిలో ఉన్న బొంబు వేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని రా సాగాడు. ఆది పక్కనే ఉన్న శత్రువులు చూసి కాల్పులు ప్రారంభించారు. ఆ దెబ్బ కి అతని శరీరం తూట్లు పడి పోయింది. అతను పడ్డ శ్రమ వృధా కాకూడదు అనుకుని మా క్యాప్టన్ అతని దగ్గరికి పరిగెత్తి అతనిని బూజాన వేసుకుని మా వైపు పరిగెట్టటం మొదలు పెట్టారు. కానీ శత్రువు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. కానీ అదే వేగం తో అతనిని బూజాన వేసుకుని మాదగ్గరికి వచేశారు. ఆ బూజాన ఉన్న వ్యక్తి కూడా శరీరానికి వేసుకున్న ఆయుధాలు వదిలి పెట్టలేదు మా దగ్గరికి వచ్చేదాకా. మాకు ఆ ఆయుధాలు అంద చెయ్యగానే అతను, మా క్యాప్టన్ చనిపోయారు. ఇది మా కంటి ముందే జరుగుతున్న చలించలేదు మేము అందరమూ. వాళ్ళు తెచ్చిన ఆయుధాల తో ఆ రాత్రి అంత పోరాడుతూ నే ఉన్నాము. సూర్యోదయం అవగానే మేము అడిగిన సహాయం అందింది. మన యుద్ధ విమానాలు వచ్చి అవతల ఉన్న శత్రువు ని మట్టు పెట్టాయి." చెప్పటం ఆపు చేశారు విక్రమ్ గారు. మళ్లీ ఆయనే మాకు తెలిసిన "లైన్ ఒఫ్ ఫైయర్" అంటే ఇది. మిమ్మలిని బాధ పెట్టి ఉంటే మన్నించండి అని అన్నారు. అప్పటికీ కానీ మన బ్రహ్మి కి అర్ధం కాలేదు తన ఎదురు కూర్చున్న వ్యక్తి ఎంత గొప్ప వారో. "మీరు?"అన్నాడు ప్రశ్నార్ధకం గా. అందుకు మన విక్రమ్ గారు, నేను "విక్రమ్ సింగ్ రాథోడ్, రాజ్‌పుతానా రైఫల్స్, 56 బటాలియన్", మీకు చెప్పిన పోరాటం కార్గిల్ యుధం లో టైగర్ హిల్స్ ని కాపాడటానికి మేము చేసిన యుద్ధం. ఆ రాత్రి మొతం 80 మంది సహచరులని పోగొట్టుకున్నా ఆ టైగర్ హిల్స్ ని స్వాధీనం చేసుకున్నాము అన్న ఆనందం మమ్మలిని సంతోషపెట్టింది. ఆ వీరోచిత పోరాటానికి కాను రాజ్‌పుతానా రైఫల్స్ కి రాష్ట్రపతి అవార్డు, విక్రమ్ గారికి,ఇంకో ముగ్గురికి వీరచక్ర అవార్డు, ఆ చనిపోయిన క్యాప్టన్ కి మరియు ఆ వీర జవానుకి పరమవీర చక్ర అవార్డు ఇచ్చారు. దానికే ఎంతో మురిసి పోయారు వల్ల కుటుంభం వాళ్ళు, కానీ మెల్లిగా వారి పేర్లు చరిత్ర లో కలిసి పోయాయి. వారికి గవర్న్‌మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇస్తుంది పెన్షన్ మాత్రమే.
మన దేశాన్ని కాపాడటానికి ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవానులని మనం స్మరిస్తున్న విధానాన్ని చూస్తే వెగటు పుడుతుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కి వస్తున్న దాంట్లో మన జవానుకి ఎంత ఇస్తున్నారో తెలుసా. 30% తక్కువ. వారిని రక్షించటానికి మన ప్రభుత్వం కర్ఛు పెట్టవలసినది ఒక్కో జవానుకి 3 లక్షలు. కానీ ఇప్పుడు పెడుతున్న కర్ఛు ఒక లక్షా 25 వేలు. మన సైన్యం లో ఒక కొత్త ఆయుధం మన జవాను చేతికి అందె సరికి ఆది ప్రపంచం లో వాడటం ఆపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ ప్రాణాలు అడ్డు వేసి మన భారత దేశాన్ని కాపాడుతున్నారు రోజు. ఏమిచ్చి వారి రుణం తీర్చుకో గలం.
జై జవాన్!!!!!!!!!

6 comments:

Anonymous said...

Very good post.
No job can match military job.

(it is not shatabdi train.
it is rajdhani express.)

Indian Minerva said...

Good one.

Sravya V said...

Good One. Thanks for sharing !

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

let's salute them! Thanks for sharing !!

amma odi said...

చాలా చాలా బాగుంది. మంచి టపా అందించినందుకు నెనర్లు!

Telugu Vilas said...

nice Article!! Thanks For sHARING tELUGU vILAS