Friday, July 10, 2009

మన తెలుగు సినిమా హీరోలు...


నేను సినిమా లు చూడటం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు చాలా మంది హీరోలు నచ్చారు.మొదటగా మన అన్న గారు ఎన్ టీ ఆర్ గారు, ఏ. ఎన్.ఆర్ గారు, కృష్ణ గారు,శొభన్ బాబు గారు. ఇంకా చాలా మంది నచ్చే వారు కానీ హీరొ కోవ లోకి వచ్చే వాళ్ళు వీరే. అప్పట్లో వీరు చేసే ఫైటింగ్ లు డ్యాన్స్ లు చూసి మైమార్చి పోయే వారు అందరు. ఇక అన్న గారు కృష్ణుడి వేషం వేస్తే సాక్షాత్తూ ఆ కృష్ణుడే కనపడినట్లు వెండి తెరకే మొక్కె వారు మన వాళ్ళు. అంత గొప్ప స్థానం పొందారు అందరి మనసుల్లో. అప్పట్లో వచ్చిన సినిమా లు కధా బలం ఉండేది. హీరొ ఉన్న కధ కి తగ్గ హీరొ నే ఉండే వారు. అన్న గారు చెయ్య వలసిన సినిమా ని నాగేశ్వర రావు గారు చేసే వారు కాదు. వాళ్ళ కి తెలుసు వాళ్ళ హద్దులు. కొంచం కృష్ణ గారు ఆ పద్దతిని మార్చారు. ఆయన ఎక్కువగా కొత్త వాటిమీద ప్రయోగాలు చేసి చాలా వాటిల్లో విజయం పొందారు. ఇక శొభన్ బాబు గారిది ఒక పద్దతి. ఆయన కుటంబ కదా హీరొ. ఇద్దరు భార్యల మధ్య నాలిగి పోవటం, ఒకరిని ప్రేమించి ఇంకొకరి ని పెళ్లి చేసుకుని బాధ పడటం లాంటివి ఆయన మాత్రమే చెయ్య గలరు. కానీ అంత మంది ఉన్న ఎవరికి వారికి సినిమాలు ఉండేవి, వాళ్ళ సొంత అభిమానులు ఉండే వారు. ఇది అంత 1983 కి పూర్వం మాట. 1984 - 85 లో వీరు అందరు కొంచం వెనక పడ్డారు. అప్పుడు మన చిరంజీవి గారు ఆ లోటు ని భర్తీ చేస్తూ అప్పటి నుంచి ఒక వెలుగు వెలుగు తున్నారు. మెగాస్టార్ అనే దానికి సార్ధకత తెచ్చారు ఆయన నటన తో. అప్పట్లో యండమూరి గారు కొన్ని నవలలు రాశారు. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటివి, చిరంజీవి గారిని దృష్టి లో పెట్టుకుని. అందుకు తగ్గట్టె చిరంజీవి గారు కూడా వాటిల్లో నటించారు. అప్పటి నుంచి మన తెలుగు సినిమా మలుపు తిరిగింది. ఒక మూస పద్దతి లో నే ఉంటున్నాయి సినిమా లు. హీరొ కి ఉన్న ఆదరణ పట్టి మాస్ ఫాలోఇంగ్ ని పట్టి కధలు తయారు అవ్వటమ్ మొదలు అయ్యింది. ఇంతలో నాగేశ్వర రావు గారి అబ్బాయి నాగార్జున, రామ నాయుడి గారి అబ్బాయి వెంకటేష్ అమెరికా నుంచి ఇండియా కి తిరిగి వచ్చి సినిమా ల్లో నటించటం మొదలు పెట్టారు. వాళ్ళకి కూడా ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. నాగార్జున మనకి ఉన్న హీరొ లలో మంచి అందగాడు, కొత్త దనాన్ని ప్రోస్థాహిస్తూ మంచి సినిమాలు తీయ్యటం మొదలు పెట్టారు. కానీ ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలం వల్ల ఆయన కూడా కొన్ని మాస్ సినిమా లు చేశారు. అవి పెద్ద విజయం సాధించాయి. ఇక వెంకటేష్ గారు కొన్ని మాస్ సినిమా లు చేస్తూ నే శొభన్ బాబు గారు చేసిన తరహా సినిమా లు కుటుంభ కదా చిత్రాలు చేశారు. ఇక్కడ మన బాల కృష్ణ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన కూడా చాలా రోజుల నుంచి అంటే అన్న గారు ఉన్నప్పటి నుంచే సినిమా ల్లో నటిస్తూ ఉన్నారు. కానీ ఆయనది అంతా నాటు పద్దతి. ఇక ఆయన దశ తిప్పిన చిత్రం సమరసింహరెడీ. అప్పటి నుంచి ఆయన అలాంటి మూస సినిమాలే చేస్తూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ హీరొ లు అందరు కూడా నిర్మాతలని వాళ్ళకి తగ్గ కధలు తయారు చేయించి అలాంటి సినిమా లు తీయ్యమంటు, అలా చేసిన వాళ్ళకే డేట్స్ ఇస్తూ ఒక విష వలయం లో చిక్కుకుని పోయారు. ముఖ్యం గా చిరంజీవి గారు, బాల కృష్ణ గారు. ఈ సమయం లో నే కళా తపస్వీ విశ్వనాథ్ గారు, తెలుగు వెలుగు బాపు గారు, హాస్య బ్రహ్మ జంధ్యాల గారు, అపర మేధావి బాలుచందర్ గారు, భారత దేశం మొతం గర్వించ తగ్గ డైరెక్టర్ మణిరత్నం గారు కూడా మంచి మంచి సినిమా లు తీశారు మన తెలుసు లో. కానీ వారు తీసిన కొన్ని గొప్ప సినిమా ల్లో పైన చెప్పిన హేరోలు చేసినవి కొన్ని మాత్రమే. చాలా మటుకు కమల్ హసన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, లేదా వేరే వాళ్ళు చేసిన వి ఉన్నాయి. అసలు చెయ్యలేదు అని కాదు కానీ నాకు తెలిసి సంతృప్తి తో చేసినవి మాత్రం కాదు. ఒక రుద్రవీణ, స్వయం కృషి, శృతిలయలు,గీతాంజలి లాంటి అపురూపమిన చిత్రాలు ఉన్నాయి కానీ సంవత్చారానికి 100+ సినిమాలు వచ్చే మన తెలుగు లో చెప్పుకోటానికి కొన్ని మాత్రమే గొప్పవి, ఇది అంతా 1983 తరువాత మాట. ఇక 1998 - 2000 తరువాత కుర్ర హీరొ ల గోల మొదలు అయ్యింది. ఇందులో ఎక్కువగా పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు. వీరు కూడా వాళ్ళ వాళ్ళ పెద్దల పద్దతి లో నే మాస్ సినిమా లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మన చిరంజీవి గారి తో ఒక వింత పద్దతి మొదలు అయ్యింది. ఒక్కడే వంద మందిని అయినా కొత్తగలిగిన వాడు హీరొ అనే ముద్ర పడిపోయింది. ఇక మన వాళ్ళు సినిమా కి వెళితే అలా కొట్ట లేని హీరొ హీరొనే కాదు అనుకోవటం మొదలు పెట్టారు. ఇహ మన బాలకృష్ణ గారు కంటి చూపు తో, తోడ కొట్టి ఛంపటం, పన్ను తో బుల్లెట్ పేల్చాటం లాంటి వింత చేష్టలు చేస్తూ ఒక రకమయిన హింస పెట్టె వారు జనాలని. అయినా మన వాళ్ళు అవి కూడా బాగానీ ఆస్వాదించారు / అనుభవించారు అనుకోవాలి.
ఇక అసలు విషయం చెప్ప వలసి ఉంది ఇక్కడ..
మొన్న ఎన్నికల్లో మెగా స్టార్ చిరంజీవి గారు ఒక కొత్త పార్టీ పెట్టి పోటీ చేసి అనుకున్న అన్ని స్టానాలు గెలవక పోయినా శాసనసభ్యుని గా అసెంబ్లీ లో కూర్చున్నారు. కానీ అందుకు జరిగిన కొన్ని సంఘటనలు వింత గా ఉన్నాయి. మీరు పవన్ కల్యాణ్ సినిమా లు చూసి ఉంటే ఆయన ని సినిమాల్లో ఎలా చూపిస్తారో ఊహించుకోండి. ఆయన మొదటి సినిమా లో ఆయన చేతులు మీదగా కారు వెళ్ళటం, తమ్ముడు సినిమా లో కొన్ని రోజుల్లో నే కిక్ బాక్సింగ్ నేర్చుకోవటానికి ఆయన పడే శ్రమా, ఇక జల్సా లో ఉన్న ఒక పాట, "హైట్ ఎంతో కొలవాలి అనుకుంటే అమాంతము ఎవరెస్ట్ అయ్యీ వస్తాడు" అని ఉంటుంది. ఆ పాటలు విన్నప్పుడు ఆయన ఫైట్స్ చూసినప్పుడు ఒక రకమైన వింత అనుభూతి పొందే వాడిని. కానీ మొన్న ఎన్నికల ముందు ఒక సభ లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఏదో జరిగి కింద పడిపోయాడు. ఎంటా అని చూస్తే
3 రోజులు వరసగా ఎండల్లో సభలకి వెళ్లే సరికి తల తిరిగి కింద పడి పోయాడు. ఇంకో సభ లో చూసుకోకుండా చెయ్యి ఎత్త గానే కరెంట్ షాక్. ఇదే పెద్ద మనిషి ఒక సినిమా లో ట్ర్యాన్స్‌ఫార్మర్ ని కూడా పేల్చి వేశాడు చేతి తో. ఆయన అలా కింద పడటం ఒక మనిషి గా బాధ అనిపించినా సినిమా ల లో మనలని ఎంత వెర్రి వాళ్ళని చేస్తున్నారో అర్ధం అయ్యింది. ఇక ఇంకో సంఘటన. మన జూనియర్ ఎన్.టీ.ఆర్ ఖమ్మం లో జరిగిన సభ లో మాట్లాడి హైదరాబాదు వస్తూ మధ్య లో కారు కి ఆక్సిడెంట్ అయ్యింది. ఆది పెద్ద వార్త్త. అసలు జరిగింది ఏంటి అంటే ఖమ్మం లో పెద్ద గొడవ పెట్టుకుని కోపం లో కొంచం తీర్ధం పుచ్చుకుని కారు తొలాడు. అందుకు నిదర్శనం మన ఖమ్మం శాసన సభులు తుమ్మల నాగేశ్వర రావు గారు. ఆయన వద్దు అని ఎంత వారించినా వినకుండా హైదరాబాదు తనే స్వయం గా కారు నడుపుతూ బయలుదేరాడు . కానీ ఒక కుక్క అడ్డు రాగానే కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. ఇదే హీరొ గారు ఒక సినిమా లో, అశోక్ అనుకుంటా, 30 కారులు, 10 లారీ లు, 100 మోటరు సైకల్ లు మీద ఉన్న విలన్లతో పోట్లాది ఒక చిన్న పిల్ల వాడిని కాపాడాడు. "ఆది" సినిమా లో తోడ కొత్త గా నే ట్ర్యాక్టర్ పేలి పోయింది. సాంబ సినిమా లో చావుని కూడా తేలికగా జయించగలిగాడు. కానీ నిజ జీవితం లో మాత్రం 3 వారాలు హాస్పిటలు బెడ్ మీద పడుకున్నాడు. మన మహేష్ బాబు గారు పోకిరి లో ఎంత మందిని కొట్టాడు? ఒకే ఒక్కడు లో ఒక అమ్మాయిని కాపాడడు, ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు చేశాడు చిన్నప్పటి నుంచి(కృష్ణ గారి సినిమా ల్లో కూడా మహేష్ చిన్నప్పుడు చాలా మంది విలన్స్ ని చితకా కొట్టాడు). కానీ ఆయన పెళ్లి విషయం వచ్చే సరికి ఇంట్లో గొడవ, పెద్దలు ఒప్పుకోలేదు, పెళ్లి అయ్యాక కూడా ఆయన సంసారం పెద్ద గొప్ప గా లేదు. ఆది కూడా మామూలు జనాల లాగానే ఆయన పరిస్థితి కూడా. అలాగే జగపతి బాబు ఒక సారి విడాకుల దాకా వచ్చి చంద్ర బాబు గారి జోక్యం తో మళ్లీ నిలబడగలిగాడు. బాల కృష్ణ గారు వెర్రి కోపం తో బెల్లం కొండ సురేష్ ని కాల్చి తరువాత ఆ కేసు నుంచి బయట పడటానికి ఎన్ని పాట్లు పడ్డాడో మన అందరికి తెలుసు. చిరంజీవి గారు అత్త కి ఏముడు అమ్మాయికి మొగుడు సినిమా లో ఒక పెళ్లి కూతురు ని పెళ్లి పీటల మీద నుంచి లేపుకుని వెళ్ళి ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయి తో పెళ్లి చేశాడు కానీ నిజ జీవితం లో మాత్రం ఆయన కూతురు అలా చేస్తే కన్నెళ్ళు పెట్టుకున్నాడు, ఎంత సీన్ చేసారో మన అందరికి తెలుసు. సినిమా ని ఒక సినిమా ల గా నే చూస్తే మనకి ఇవి అన్ని పెద్ద విషయాలు కాదు. ఎవరి జీవితం వారిది. కానీ మన సమాజం లో సినిమా అన్నది మన జీవితాల్లో ఒక బాగం. అందులో హీరొ లు మనకి ఆదర్శం. నాకు తెలిసి ఒక వయసు వచ్చినప్పటి నుంచి మనం హీరొ ల ని అనుకరించాము. మన వేషం, బాష కూడా వారు చేసినట్టు మార్చుకున్నాము. ఒక ఉదాహరణ ఇక్కడ. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ వచ్చిన కొత్తలో బాక్స్ బధలు అవుతుంది, ఫేసు టర్న్నీంగ్ ఇచ్చుకో అన్న పదాలు ఎంత లా జనాలు వాడారో అందరికి తెలుసు. హీరొ లు చేసుకునట్టు జుట్టు పెంచుకోవటం, కత్తిరించుకోవటం, నడక, అమ్మాయిల ని ఫాలొ చెయ్యటం, ఇలా ఒక్కాటేమిటి చాలా ఉన్నాయి. అమ్మాయిలు కూడా సినిమా హీరొఇన్నులు వేసుకునే డ్రెస్ లు చీరలు అలంకరణ అన్ని పాటించటం, అన్ని చేస్తూ నే ఉంటారు.
ఇలాంటి హీరొలు చేసే ఒక్కో సినిమా కి ఖర్ఛు ఎంత అవుతుందో మనకి తెలుసు. అందులో ఎక్కువ బాగం హీరొ గారికి సమర్పించే దే. ఇప్పుడు ఉన్న రాటు ప్రకారం జూనియర్ ఎన్.టీ.ఆర్ 7 కోట్లు ఆట, మహేష్ బాబు కూడా అంతే. పవన్ గారు అటు ఇటు గా 6 కోట్లు ఆట, నాగార్జున గారు కూడా అంతే.

మొన్న జరిగిన ఎలెక్షన్ ల తరువాత నుంచి వీరు చేసే సినామాలకి వాళ్ళకి అంత ఇవ్వవచ్చా, వాళ్ళు నటించే సినిమా లు చూడటం అంత అవసరమా అనే ప్రశ్న వచ్చిందీ.

వీళ్ళు అందరు మనకి వెండి తెర వెనుక కనపడితే నే అందం, వారికి కూడా అదే మంచిది. లేక పోతే వారు కూడా మన లాంటి వారే అనే ఒక అభిప్రాయం కానీ జనాలకి ఏర్పడితే సినిమాలు చూడరు.

ప్రశ్న వేసుకోవటం వరకే కానీ మళ్లీ మంచి సినిమా వస్తే నేను కూడా ఇవి అన్ని పక్కన పెట్టి మళ్లీ టికెట్ తీసుకుని సినిమా కి పరుగె పరుగు.....

4 comments:

Ammadu said...

Chala baga rasarandi... Inthakumundu Heros ante oka lanti craze undedhi naku.. Monna jarigina elections chusaka... meeru annattu...e cinema chusina, hero overaction chesthunnadu ani anipisthundi... endukante real life lo vallentha sunnithamayina vallo chusam kadha ..prapancham mottham lo mana telugu industry e chala peddadi ani vinnanu... kani a vibhavam ika manaki undademo anipisthundi ma cinema valla dhorani chusthunte... Anyway, Mi Blog chala bavundi.. Please keep going...

Anonymous said...

meeku chala vishayalu telusandi...

Unknown said...

i think you are right.monna elections taruatha chiranjeevi ni kani,rojani kani,ntr ni kani evarini chusina veellu mana lanti normal people e.they do have emotions like us ani anipinchindi.piga antha pedda thelivayina vallu kuda kadu anipisthundi.valla goppa only emotions ni pandichitam.they can only act in different kind of parts in life.anthe kani vallemi pedda desanni uddarinche goppathanam malo vundi anukunte chiranjeevigarilage badapadalsi vasthundi.evaru pakkavallani uddarinchalani e pani cheyyatledu.vallaki emanna labham vunda ani alochinchi chesthunnaru anthe.atleast teesukunna dabbulaki panikoche panulemanna chesthunnara ante adi ledu...everyone is like that.politicians e padakam pravesapedithe dabbulu ekkuva miguluthayi,next elections ki votes padathayi ani alochisthunnaru.kani janalaki entha use avuthundi,manam chesedanivalla janala responsibility penchedi ga vunda leda ani alochinchatledu.naku chala badaga vundi.kani emi cheyyalekapothunnam......

Telugu Vilas said...

GOOD article Thanks for sharing Telugu Vilas