Monday, August 10, 2009

కనువిప్పు.......

ఒక మధ్య తరగతి కుటుంభం నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగం లో ఉన్నాడు కొడుకు. అతను ఆ పొసిషన్ లో ఉండటానికి అతని తల్లి తండ్రులు పడ్డ శ్రమ అతను ఎప్పుడు మార్చిపోలేదు. అతను ముంబై లో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు అతనిని, మనవలని చూడటానికి అతని తల్లి తండ్రులు ముంబై వెళుతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా రైలు లో వెళ్లే వారు. ఒకసారి కొడుకు వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ పంపించాడు తన దగ్గరికి రావటానికి వాళ్ళకి. అంతే అవి అందుకున్న వాళ్ళు చిన్న పిల్లల లాగా ఆనందించారు. మొదటి సారి ఫ్లైట్ ఎక్క బోతున్నందుకు. వెళ్ళటానికి ఇంకా 15 రోజులు ఉన్నా అవి అందిన రోజు నుంచే ఒక రాక మైన ఆనందం వాళ్ళకి. తమ స్నేహితులకి చెప్పుకున్నారు తమ కొడుకు ఫ్లైట్ టికెట్ లు పంపించాడు అని. రోజులు దగ్గరికి వస్తున్న కొద్ది ఆరాటం పెరగ సాగింది. అన్ని సర్ధుకోవటం, మనవాళ్ళకి చిరుతిండ్లు చెయ్యటం, కొడుకు కోడలికి కావలసినవి తీసుకోవటం. వాళ్ళు ప్రయాణం చేసే రోజు రానే వచింది. ఆ రోజు ఉదయం నుంచే చిన్న పిల్లలి లాగా హుషారు గా అన్ని పనులు పూర్తి చేసుకుని ఫ్లైట్ టైమ్ ఇంకా మూడు గంటలు ముందే ట్యాక్సీ తీసుకుని ఏర్‌పోర్ట్ కి బయలుదేరారు. మధ్య లో వీళ్ళ ఫోన్ కి ఒక sms వచింది ఫ్లైట్ 3 గంటలు లేటు అని. కొంచం నీరస పడ్డారు. కానీ వెనకకి వెళ్ళటం ఇష్టం లేక ఏర్‌పోర్ట్ కి వెళ్లారు. ఆది కొత్త ప్రపంచం వాళ్ళకి. లోపలకి వెళ్ళటం అదే మొదటి సారి. అన్నిటినీ వింత గా చూడసాగరు. ఆ మూడు గంటలు సమయం కూడా ఎలా గడిచిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కే సమయం వచింది. వాళ్ళు మొదటి సారి ఫ్లైట్ లో కి అడుగు పెట్టగానే కంగారు, ఆనందం. హైదరాబాదు నుంచి ముంబై కి 45 నిమిషాలు ప్రయాణం. కానీ వాళ్ళు ప్రతి నిమిషానిని ఆనందించారు. ఫ్లైట్ ముంబై లో ఆగగానే సామనులు తీసుకుని బయటకి వచ్చారు. అక్కడ తమ కొడుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అతనిని చూడగానే దగ్గరికి వచ్చి కావలించుకుని థాంక్స్ చెప్పారు ఇద్దరు. అతనికి అర్ధం కాలేదు ఎందుకో. అదే అడిగితే వాళ్ళ కల తీర్చినందుకు అన్నారు. కొడుకు ఆనందక పడక పోగా తాను ఇన్ని రోజులు చేసిన తప్పు కి సిగ్గు పడ్డాడు.

కొడుకు మంచి ఉద్యోగం లో ఉన్నాడు. తాను ఉద్యోగం పేరు తో ఎన్నో సార్లు ఫ్లైట్ ఎక్కాడు. బయటి ప్రపంచం చూసాడు. ముంబై లో మంచి జీవితం. పిల్లలు మంచి స్కూలు లో చదువుతున్నారు. అతనికి కారు. ఇంత మంచి జీవితం అతని తల్లి తండ్రులు పడ్డ శ్రమ వాళ్ళ కష్టం. తనకి చిన్నప్పటి నుంచి ఏది కావాల్లన్న తాను అడగకుండా నే అన్ని తీర్చే వారు. తనకి మంచి చదువు చెప్పించటానికి వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. తనకి మంచి ఉద్యోగం వస్తే అతని నుంచి ఏమీ ఆశించకుండా కుదిరితే వాళ్లే అతనికి ఏది కావాలంటే ఆది పంపించే వారు. అలా గాని కొడుకు తల్లి తండ్రులని తక్కువ చేసి చూడలేదు. కానీ అలా అతనికి తమ కోరిక తీర్చినందుకు థాంక్స్ చెప్పే సరికి కొంచం బాధ పడ్డాడు. తాను సంపాదిస్తున్న దాని తో ఈ పని ఎప్పుడో చేయగలడు కానీ టికెట్స్ తక్కువ కి వస్తున్నాయి అన్న ఒక్క పేరు తో వాళ్ళకి ఆ ఫ్లైట్ టికెట్ లు పంపాడు. కానీ తాను చేసిన తప్పు అర్ధం అయ్యింది. తన తల్లి తండ్రులు తనకోసం ఎన్నో త్యాగాలు చేస్తే తాను మాత్రం ఇంత సంకుచితం గా ఆలోచించాడు. వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. పెద్దవి కాక పోవచు. కానీ వాటిని తీర్చటం తన ధర్మం. వాటికి ఎంత డబ్బు కర్ఛు అయినా పర్వాలేదు. ఇక మిగిలిన రోజులు వాళ్ళు సుఖం గా ఉండాలి. అందుకే అక్కడే ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఇంకా ఇష్టమైన ఊటీ, కన్యాకుమారి ట్రిప్ కి వెళ్ళబోతున్నారు అని చెప్పాడు వాళ్ళకి.

ఇంకా కొన్ని బ్లోగుల కోసం చూడండి.

http://www.naaabhiprayaam.blogspot.com

Monday, August 3, 2009

స్వచ్చమైన ప్రేమ...

ఒక తండ్రి తన కొత్త కారు ని కడుగుతూ ఉన్నాడు. అతని దగ్గరికి అతని మూడు సంవత్చరాల కొడుకు వచ్చి అతని పని ని పాడు చెయ్యకుండా తండ్రికి అన్ని అందిస్తూ అతని పనిలో సహాయం చేస్తూ ఉన్నాడు. కొంచం సేపు అయ్యాక తండ్రి వేరే పని లో పడిపోయాడు. కొడుకుని పట్టించుకోలేదు. కొంచం సేపు అయ్యాక ఆ తండ్రి కొడుకు ఏమీ చేస్తున్నాడో అని చూడటానికి వచ్చే సరికి ఆ పిల్ల వాడు ఒక చిన్న పదునయిన వస్తువు తీసుకుని కారు మీద ఏదో రాస్తూ కనపడ్డాడు. అసలే కొత్త కారు అందులో చాలా మోజు పడి కొనుక్కున్నది, అంతే తండ్రికి పట్టరాని కోపం వచ్చి చేతికి ఏదో అందినది తీసుకుని కొడుకుని కొట్టాడు. ఆ దెబ్బ కి కొడుకు చేతికి తగిలి రక్తం రాసాగింది. తండ్రికి తాను చేసిన తప్పు తెలిసి హడావిడిగా కొడుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి కొడుకు వి రెండు వెళ్లు విరిగి పోయాయి, వాటిని తీసేయ్యాలి అని చెప్పారు. తండ్రి బాధ తట్టుకోలేక ఏడుస్తూ కూర్చున్నాడు. డాక్టర్లలని వెడుకున్నాడు వేరే ఏది అయినా మార్గం ఉంటే దానితో తన కొడుకు వెళ్లు బాగు చెయ్యమని. కానీ వేరే మార్గం లేక డాక్టర్లు ఆ బాబు వెళ్లు తీసి వేశారు. తండ్రికి బాధ కలిగి తాను అంత రాక్షసుడిలా మారటానికి కారణం అయిన కారు దగ్గరికి వెళ్లాడు. అసలు తన కొడుకు ఏమీ చేసాడో కూడా చూడలేదు కొడుకుని కొట్టెముందు. అక్కడికి వెళ్ళి కరుని చూసి మూర్చ పోయాడు. మళ్లీ ఈ లోకం లో కి వచ్చి ఆది చూసి భోరున ఏడవటము మొదలు పెట్టాడు. ఆ ఏడుపు ఆపటము ఎవరి వల్ల కాలేదు. ఆ కారు మీద తన కొడుకు రాసినది.....

"ఈ లవ్ యూ డాడ్" / "I love you DAD"

Wednesday, July 29, 2009

ఒక టెర్రరిస్టు బాధ(కల్పితం)

ఇది ఒక టెర్రరిస్టు , అతని బాస్ కి మధ్య జరిగిన సంభాషణ. ఇద్దరు పాకిస్తాన్ లో ఉన్నారు.

బాస్: నీకు ఒక గొప్ప పని చెపుతున్నాను. నువ్వు ఇంకొక 10 మంది కలిసి మన శత్రువు మీద దాడి చెయ్యాలి.
టెర్రరిస్టు : నేను ఆ పని చెయ్యను. చెయ్యలేను.
బాస్: పెద్దలు చెప్పిన మాట వినక పోతే, మన శత్రువు ని చంపక పోతే నిన్ను అల్లా మన్నించరు.
టెర్రరిస్టు : నేను మిమ్మలిని దిక్కరించటం లేదు కానీ మా బాధ కూడా అర్ధం చేసుకోండి.
బాస్ : ఇది చేసినందుకు మీకు ఒక్కొకారికి 5 లక్షలు ఇస్తారు. మీరు చనిపోతే మీ వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకుంటారు.
టెర్రరిస్టు : అవి అన్ని నిజమే కానీ...
బాస్ : కానీ ఏంటి ఇంకా
టెర్రరిస్టు : నాకు ఎందుకో మనసు రావటం లేదు ఈ పని చెయ్యటానికి.
బాస్ : శత్రువు ని చంపటానికి వెనకాడుతున్నావా?
టెర్రరిస్టు : కాదు కానీ మేము చేసినాదాని ఉపయోగం ఏదయినా ఉంటుందా?
బాస్: ఎందుకు ఉండదు? మన శత్రువు ని చావు దెబ్బ కొడాదాము.
టెర్రరిస్టు : మేము దాడి చేస్తే ఎంత మంది చనిపోతారు?
బాస్ : మన లక్ష్యం 100 మంది. దొరికితే ఇంకా ఎక్కువ మందిని ఛంపండి.
టెర్రరిస్టు : చంపితే?
బాస్: మన శత్రువు కి మన సత్తా తెలుస్తుంది. మన అన్నదమ్ములని హింసిస్తున్నందుకు వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి.
టెర్రరిస్టు : ఆది సరే కానీ మేము 100 మందిని చంపితే మన శత్రువు ప్రతిచర్య ఎలా ఉంటుంది?
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు: చెప్పండి...
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు :అర్ధం అయ్యిందా నేను ఈ పని ఎందుకు చెయ్యకూడదు అనుకుంటున్నామో..
బాస్ : కానీ..
టెర్రరిస్టు : మా బాధ కూడా వినండి. మేము ఇక్కడి నుంచి ఎంతో కష్టపడి మన శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకరి లాగా కలిసి పోయి వాళ్ళ మీద దాడి చేస్తాము. ఒక 100 - 200 వందల మందిని మట్టు పెడతాము. ఇది అంతా చేసినందుకు మాకు మీరు డబ్బులు కూడా ఇస్తారు కానీ మేము ఇది చేసేది ఒక్క డబ్బు గురించే కాదు, మన శత్రువు వాళలో ఒక్కడు చనిపొయినా, 100 మంది చనిపొయినా పడే బాధ చూసి ఆనందించటానికి. కానీ ఆది జరగదు. మేము ఎంత మందిని ఛంపినా మరుసటి రోజు ఏమీ జరగనట్టే అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. నిన్న ఎంత మంది పోయారు అని క్రికెట్ స్కోర్ అడిగినట్టు అడుగుతారు తప్ప నిజం గా బాధ పడి కాదు. పోయిన ఏడాది ముంబై లో ట్రైను లో బొంబులు పెట్టి 150 మందిని చంపి గర్వంగా తిరిగి వస్తే ఆ తరువాత రోజు అదే దారిలో మళ్లీ జనాలు తిరుగుతున్నారు అని తెలిసి చాలా బాధ పడ్డాము. అసలు నిన్న అక్కడ ఏమీ జరగనట్టు ఉన్నారు అందరు. ఎవరో వాళ్ళ వాళ్ళు పోతే వాళ్ళు బాధ పడ్డారు తప్ప వేరే వాళ్ళు వల్ల పని వాళ్ళు చేసుకున్నారు. మొన్న అదే ముంబై లో హోటెల్ లో కి వెళ్ళి 200 వందల మందిని ఛంపుతూ ఉంటే దానిని టీవీ లో రోజుల తరబడి చూస్తూ కూర్చున్నారు. మాకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు టీవీ వాళ్ళు. పొరపాటున మాలో ఒక్కడు దొరికి పోయాడు. వాడికి అసలు ఎక్కడ ఉన్నడో అర్ధం కావటం లేదు. టైమ్ కి తిండి, చికన్ బిర్యానీ తో, మంచి బట్టలు, చదువుకోటానికి పుస్తకాలు, చూడటానికి టీవీ, కావలసినంత హంగామా. ఈ సారి కూడా మాలో ఎవరినా పోలీసులకి దొరికితే వాడు జీవితాంతము బ్రతక కుండా చావకుండా అలా కోర్టుల మధ్య నాలిగి పోవలసిందే. కొన్ని రోజులకీ వాడికే చికాకు పుట్టి నేనే చేశాను బాబోయి అన్నా, అంతా ఒప్పుకున్న కూడా వాళ్ళు ఆది కూడా నాటకమే అని దాని మీద కోర్టులో వాదనలు. ఇక మేము ఇంత కాస్త పడింది మన శత్రువు కి చీము నెత్తురు ఉంటే మన తో యుద్ధం చెయ్యటానికి వస్తాడు, అప్పుడు చూసుకుందాము అనుకుంటే ఆది కూడా అవ్వతం లేదు. అక్కడి నాయకులు అందరు ఇది జరిగినందుకు ఇంత మంది చనిపోయినందుకు చింతిస్తున్నాము, టెర్రరిస్టుల ఆట కట్టిస్తాము అనే అంటారు తప్ప ఎలా కట్టిస్తారో చెప్పారు. మళ్లీ ఏది అయినా పెద్ద గొడవ జరిగే అంత వరకు మళ్లీ మాట ఎత్తారు. వాళ్ళ ప్రజలు అన్నా ఇది మనసు లో పెట్టుకుని ఎలెక్షన్ ల లో ఓటు వేస్తారా అంటే అదీ లేదు. ఇలా అయితే మన వాళ్ళు నీరసించి పని చెయ్యలేక మన శత్రువు దగ్గరికే వెళ్ళి వాళ్ళ సన్యాసులలో కలిసి పోయే ప్రమాదం ఉంది.
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు : చెప్పండి ఏమీ చెయ్యమంటారో
బాస్ : ఓరాయ్ పిచీ సన్నాసి, ఒక దొంగ ని పట్టుకుని శిక్షిస్తే వాడు మళ్లీ బయటకి వచ్చాక అదే మార్గం అనుసరిస్తాడు. ప్రతీకారం తీర్చుకోటానికి ప్రయత్నిస్తాడు. అదే వాడిని అందరి ముందు నిలబెట్టి వీడు దొంగ అని ముద్ర వేసి వదిలేస్తే వాడే కుళ్ళి కుళ్ళి చస్తాడు. మళ్లీ ఆ పని చెయ్యటానికి సాహసించాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కానీ మనకి చీము నెత్తురు లేదు కాబట్టి మనం మళ్లీ అవే దాడులు చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాము. మన శత్రువు కూడా ఒకే తప్పు చేస్తున్నాడు కాబట్టే మనం ఇంత సాహశిస్తున్నాము. అదే ఒక్క సారి అయినా ఎదురు తిరిగి మన మీద దాడి చేస్తే ఇవి అన్ని కొన్ని రోజులు జరగవు. వాళ్ళు ఆ పని చెయ్యరు. మనం ఇంత పెద్ద దాడి చెయ్యగలుగుతున్నాము అంటే మనకి ఆ దేశం లోనే మిత్రులు ఉన్నారు. వాళ్ళ సాయం తోనే మనం ఏది అయినా చెయ్యగలం. మనం చేసే వాటిని తట్తుకోవాలి అంటే ముందు వాళ్ళ దేశం లో మనకి సహాయం చేసే వాళ్ళని పట్టుకుని కఠినం గా శిక్షిస్తే ఇవి అన్ని తగ్గుతాయి. ఆది జరగదు ఎందుకంటే అక్కడ నాయకులకి పదవి భయం. మన వాళ్ళని ముట్టుకుంటే రాబోయే ఎలెక్షన్ ల లో మన వాళ్ళ ఓట్లు పడవు అనే భయం. ఆది ఉన్నంత సేపు మనకు ఏ భయము లేదు. మనం మన పని చేసుకు పోవలసిందే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకు పోతారు. ఇది ఆగదు!!!!

Monday, July 27, 2009

కార్గిల్ వీరుల గుర్తు గా..

కార్గిల్ వీరుల గుర్తు గా..

మన సైన్యం గురించి రాసే అంత పెద్ద వాడిని కాదు. కానీ కార్గిల్ యుధం జరిగిన తరువాత ఒక 2 సంవత్చరాలకి ఒక మైల్ వచింది. ఆది గుర్తుకు వచ్చింది.

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు,( మనకి బాగా ఇష్టమయన బ్రహ్మి అనే పేరు పెడదాం), ఇంకొక వ్యక్తి పేరు విక్రమ్. ఇద్దరు బెంగుళూరు నుంచి డిల్లీ కి రాజధాని లో బయలుదేరారు. ఇద్దరు ఎదురు ఎదురు బెర్తులు. బండి బయలుదెరగానే ఇద్దరు పలకరించుకున్నారు. మన బ్రహ్మి ఒక మంచి కంపనీ లో మంచి పొసిషన్ లో ఉన్నాడు. సామాన్యం గా అయితే ఫ్లైట్ లో వెళ్ళవలసింది కానీ టికెట్ లు దొరకక ఇలా బయలుదేరాడు. ఆ కోపం ఉంది తనకి మనసులో. ఇక అవతల వ్యక్తి ఘంభీరం గా ఉన్న మంచి సమయాస్పూర్తి తో అందరినీ కలుపుకుని వెళుతున్నారు. కొంచం దూరం వెళ్ళగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. ఏసీ ట్రేన్ అంటే బయట ప్రపంచం తెలియదు. ఇక మన విక్రమ్ గారికి కొంచం బోర్ కొట్టి మన బ్రహ్మి తో మాటలు కలిపారు. అప్పటికే మన బ్రహ్మి తన ల్యాప్‌టాప్ లో తల పెట్టి ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. విక్రమ్ గారు మాట్లడించాలా లేదా అని అనుకుని "మీ పేరు?" అన్ని అడిగారు. మన వాడు తన పేరు తో పాటు పలానా కంపనీ లో తన పోస్ట్ కూడా చెప్పాడు. విక్రమ్ కి అర్ధం కాక వాళ్ళు ఏమీ తయ్యారు చేస్తారు అని అడిగారు. అందుకు మన వాడు సాఫ్ట్‌వేర్ తయ్యారు చేస్తారు అన్నాడు. ఆయనకి ఇంకా అర్ధం కాలేదు. వివరం గా చెపుతారా అన్నారు. అందుకు మన వాడికి కొంచం కోపం వచ్చి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో కూడా తెలియని వాడికి మొత్తం చెప్పాలి అంటే కొంచం బాధ పడ్డ మన గొప్పదనం చెప్పుకుందాం అని మొదలు పెట్టాడు. "మేము కంప్యూటర్ ని వాడి సాఫ్ట్‌వేర్ తయ్యారు చేస్తాము. ఆది ప్రపంచం లో ఉన్న వాళ్ళకి అమ్ముతాము. ఇంకా వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ పనులు కూడా చేసి పెడతాము. అందుకు మా కంపనీ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారు." అని అన్నాడు. మన విక్రమ్ గారికి కొంచం అర్ధం అయ్యింది. ఆయన మళ్లీ మన వాడిని మీకు మంచి జీతాలు ఉంటాయి అనుకుంటా అన్నారు. మన వాడికి కొంచం కోపం వచ్చి మేము కష్ట పడే దాంట్లో మాకు వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ అన్నాడు. దానికి విక్రమ్ గారు మీరు అంత కష్ట పడతారా అన్నారు. ఆ మాట తో మన వాడికి బాగా కోపం వచ్చి "కంప్యూటర్ అంటే ఏంటో తెలియని మీకు ఇవన్ని అర్ధం కావు. మేము ఒక ప్రాజెక్ట్ లో పని చేసి క్లైంట్ కి తగ్గట్టు అన్ని పనులు చేసి, మధ్యలో వాళ్ళు ఏది అయినా మార్పు చేస్తే వాటిని కూడా అమలు చేసి ఇవ్వాలి. ఇది అంతా క్లైంట్ ఇచ్చిన టైమ్ లో నే చెయ్యాలి. రోజు మీటింగ్ లు, ఇంట్లో ఉన్నా ఫోన్ లు, వారాంతం లో కూడా పని, రోజు 10 -12 గంటలు పని, క్లైంట్ కి ఏదెనా నచక పోతే వాళ్ళు తిట్టే తిట్లని కూడా మేమే భరించాలి. మీకు ఆ "లైన్ ఒఫ్ ఫైయర్" అర్ధం కాదు, చెప్పినా అర్ధం చేసుకోలేరు" అన్నాడు ఆవేశం గా. అందుకు మన విక్రమ్ గారు అయ్యో మీకు కోపం వచినట్టున్నది. మన్నించండి. నిజమే మీరు అన్న "లైన్ ఒఫ్ ఫైయర్" కి మీరు చెప్పిన అర్ధం నాకు తెలియదు. నాకు తెలిసిన అర్ధం వేరు. ఆది ఎంతో చెపుతాను వినండి. ఒక 100 మంది కలిసి ఒక ఎత్తు అయిన కొండ ని కాపాడాలి అన్న అధికారుల ఆదేశం తో బయలుదెరాము మేము. మాతో పాటు మా క్యాప్టన్ కూడా ఉన్నారు. ఆ కొండ అవతల ఎంత మంది ఉన్నారో తెలియదు. చిమ్మ చీకటి. ఆ కొండ ఎక్కటం చాలా కష్టం. ఆది నిట్ట నిలువు గా ఉంది. పైగా వర్షం. కానీ తప్పదు. ఎంతో ముఖ్య మైన పని అయితే తప్ప మమ్మలని పంపించారు. అందుకే అందరమూ ఆ పని ఎలాగా అయినా పూర్తి చెయ్యాలి అని బయలుదేరాము. ఆ కొండ కిందకి రాగానే పై నుంచి రాళ్లు కింద పడసాగాయి. కొంచం పైకి వెళ్ళగానే ఎక్కడినుంచో ఒక బాంబ్ మామధ్య లో పడింది. అంతే ఒక 10 మంధీ అక్కడికక్కడే చనిపోయారు. మా కళ ముందే అంత మంచి చనిపొయినా చలించ లేదు. ఇంకా కొంచం జాగ్రత గా ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాము. అప్పుడు అర్ధం అయ్యింది కొండ అవతల వైపు శత్రువులు ఎక్కువ సంఖ్య లో నే ఉన్నారు అని. మేము పై అధికారులకి సమాచారం ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రాత్రి కి ఏ సహాయము అందదు, అలానే ఉండాలి రేపు ఉదయానకి సహాయం పంపిస్తాము అన్నారు. ఇంకా ఆ రాత్రికి గడవటానికి 6 గంటలు సమయం ఉంది. అవతల నుంచి బాంబుల వర్షం కురుస్తుంది. ఏదో ఒక రకం గా వాటిని తప్పించుకుంటూ ముందు కి వెళుతున్నాము. కొంచం పైకి వెళ్ళగానే ఆ ప్రదేశం నుంచి అవతల శత్రువుని కొంచం చూడటానికి వెసులు బాటు ఉంది. ఎంత మంది ఉన్నారో అని చూస్తే ఒక పెద్ద సైన్యమే ఉంది పైన ఉన్న వాళ్ళకి సహాయం గా అక్కడ. వాళ్ళని నిలువరించటం అక్కడ మిగిలిన 50 మంది వల కాదు కానీ తప్పదు ప్రాణాలు పోయినా తప్పదు. ముందు కి కదిలాము మిగిలిన వాళ్ళు అందరమూ. అలా కొంచం పైకి వెళ్ళి పెద్ద పెద్ద బండల చాటున ఉన్నాము. ఇక మిగిలినది కొంచం ఎత్తు అయినా శత్రువు కు అప్పటికే ఆ ఎత్తు లో ఉన్న ఉంది. వాళ్ళని మట్టు పెట్టాలి అంటే వాళ్ళని దొంగ దెబ్బ తీయ్యాలి. అందుకు మిగిల వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టారు. ఒక్కో జట్టు ఒక్కొక్క వైపు నుంచి అవతల కొండ మీద ఉన్న శత్రువుని చావు దెబ్బ కొట్టటం అన్నది ప్లాను. అలానే ముందు కి వెళుతున్నాము. కానీ పైనుంచి పడుతున్న బాంబులు మాలో చాలా మందిని చంపేశాయి. అలా నే కష్ట పడి 3 జట్ల లో ఒక జట్టు అందరినీ తప్పించుకుని శత్రువు ముందుకి వెళ్ళి ఒక ప్రదేశం లో ఉండగలిగారు. వాళ్ళు ఇచ్చిన సందేశం తో మిగిలిన జట్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మిగిలింది అవతలి శత్రువు ని మట్టు పెట్టటం. ఆ రాత్రి కి ఇంకా 3 గంటలు సమయం ఉంది. మాలో మిగిలింది 22 మంది. అయినా సరే మొండి ధైర్యం తో పోరాటం మొదలు పెట్టాము. మా క్యాప్టన్ కూడా మాతో పోరాడుతూ మమ్మలిని ఉత్తేజ పరుస్తూ శత్రువుని చీల్చి చెండాడుతూ ఉన్నారు. ఇంతలో మాదగ్గర ఉన్న ఆయుధాలు అయిపొసాగాయి. ఆది తెలిసి అవి అయిపోతే అవతలి శత్రువు మా అందరినీ చంపేస్తారు అని అనుకుని మాలో ఉన్న ఒక అతను ఎదురు శత్రువు శిభిరామ్ లో కి పరుగెత్తి చేతిలో ఉన్న బొంబు వేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని రా సాగాడు. ఆది పక్కనే ఉన్న శత్రువులు చూసి కాల్పులు ప్రారంభించారు. ఆ దెబ్బ కి అతని శరీరం తూట్లు పడి పోయింది. అతను పడ్డ శ్రమ వృధా కాకూడదు అనుకుని మా క్యాప్టన్ అతని దగ్గరికి పరిగెత్తి అతనిని బూజాన వేసుకుని మా వైపు పరిగెట్టటం మొదలు పెట్టారు. కానీ శత్రువు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. కానీ అదే వేగం తో అతనిని బూజాన వేసుకుని మాదగ్గరికి వచేశారు. ఆ బూజాన ఉన్న వ్యక్తి కూడా శరీరానికి వేసుకున్న ఆయుధాలు వదిలి పెట్టలేదు మా దగ్గరికి వచ్చేదాకా. మాకు ఆ ఆయుధాలు అంద చెయ్యగానే అతను, మా క్యాప్టన్ చనిపోయారు. ఇది మా కంటి ముందే జరుగుతున్న చలించలేదు మేము అందరమూ. వాళ్ళు తెచ్చిన ఆయుధాల తో ఆ రాత్రి అంత పోరాడుతూ నే ఉన్నాము. సూర్యోదయం అవగానే మేము అడిగిన సహాయం అందింది. మన యుద్ధ విమానాలు వచ్చి అవతల ఉన్న శత్రువు ని మట్టు పెట్టాయి." చెప్పటం ఆపు చేశారు విక్రమ్ గారు. మళ్లీ ఆయనే మాకు తెలిసిన "లైన్ ఒఫ్ ఫైయర్" అంటే ఇది. మిమ్మలిని బాధ పెట్టి ఉంటే మన్నించండి అని అన్నారు. అప్పటికీ కానీ మన బ్రహ్మి కి అర్ధం కాలేదు తన ఎదురు కూర్చున్న వ్యక్తి ఎంత గొప్ప వారో. "మీరు?"అన్నాడు ప్రశ్నార్ధకం గా. అందుకు మన విక్రమ్ గారు, నేను "విక్రమ్ సింగ్ రాథోడ్, రాజ్‌పుతానా రైఫల్స్, 56 బటాలియన్", మీకు చెప్పిన పోరాటం కార్గిల్ యుధం లో టైగర్ హిల్స్ ని కాపాడటానికి మేము చేసిన యుద్ధం. ఆ రాత్రి మొతం 80 మంది సహచరులని పోగొట్టుకున్నా ఆ టైగర్ హిల్స్ ని స్వాధీనం చేసుకున్నాము అన్న ఆనందం మమ్మలిని సంతోషపెట్టింది. ఆ వీరోచిత పోరాటానికి కాను రాజ్‌పుతానా రైఫల్స్ కి రాష్ట్రపతి అవార్డు, విక్రమ్ గారికి,ఇంకో ముగ్గురికి వీరచక్ర అవార్డు, ఆ చనిపోయిన క్యాప్టన్ కి మరియు ఆ వీర జవానుకి పరమవీర చక్ర అవార్డు ఇచ్చారు. దానికే ఎంతో మురిసి పోయారు వల్ల కుటుంభం వాళ్ళు, కానీ మెల్లిగా వారి పేర్లు చరిత్ర లో కలిసి పోయాయి. వారికి గవర్న్‌మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇస్తుంది పెన్షన్ మాత్రమే.
మన దేశాన్ని కాపాడటానికి ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవానులని మనం స్మరిస్తున్న విధానాన్ని చూస్తే వెగటు పుడుతుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కి వస్తున్న దాంట్లో మన జవానుకి ఎంత ఇస్తున్నారో తెలుసా. 30% తక్కువ. వారిని రక్షించటానికి మన ప్రభుత్వం కర్ఛు పెట్టవలసినది ఒక్కో జవానుకి 3 లక్షలు. కానీ ఇప్పుడు పెడుతున్న కర్ఛు ఒక లక్షా 25 వేలు. మన సైన్యం లో ఒక కొత్త ఆయుధం మన జవాను చేతికి అందె సరికి ఆది ప్రపంచం లో వాడటం ఆపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ ప్రాణాలు అడ్డు వేసి మన భారత దేశాన్ని కాపాడుతున్నారు రోజు. ఏమిచ్చి వారి రుణం తీర్చుకో గలం.
జై జవాన్!!!!!!!!!

Friday, July 10, 2009

మన తెలుగు సినిమా హీరోలు...


నేను సినిమా లు చూడటం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు చాలా మంది హీరోలు నచ్చారు.మొదటగా మన అన్న గారు ఎన్ టీ ఆర్ గారు, ఏ. ఎన్.ఆర్ గారు, కృష్ణ గారు,శొభన్ బాబు గారు. ఇంకా చాలా మంది నచ్చే వారు కానీ హీరొ కోవ లోకి వచ్చే వాళ్ళు వీరే. అప్పట్లో వీరు చేసే ఫైటింగ్ లు డ్యాన్స్ లు చూసి మైమార్చి పోయే వారు అందరు. ఇక అన్న గారు కృష్ణుడి వేషం వేస్తే సాక్షాత్తూ ఆ కృష్ణుడే కనపడినట్లు వెండి తెరకే మొక్కె వారు మన వాళ్ళు. అంత గొప్ప స్థానం పొందారు అందరి మనసుల్లో. అప్పట్లో వచ్చిన సినిమా లు కధా బలం ఉండేది. హీరొ ఉన్న కధ కి తగ్గ హీరొ నే ఉండే వారు. అన్న గారు చెయ్య వలసిన సినిమా ని నాగేశ్వర రావు గారు చేసే వారు కాదు. వాళ్ళ కి తెలుసు వాళ్ళ హద్దులు. కొంచం కృష్ణ గారు ఆ పద్దతిని మార్చారు. ఆయన ఎక్కువగా కొత్త వాటిమీద ప్రయోగాలు చేసి చాలా వాటిల్లో విజయం పొందారు. ఇక శొభన్ బాబు గారిది ఒక పద్దతి. ఆయన కుటంబ కదా హీరొ. ఇద్దరు భార్యల మధ్య నాలిగి పోవటం, ఒకరిని ప్రేమించి ఇంకొకరి ని పెళ్లి చేసుకుని బాధ పడటం లాంటివి ఆయన మాత్రమే చెయ్య గలరు. కానీ అంత మంది ఉన్న ఎవరికి వారికి సినిమాలు ఉండేవి, వాళ్ళ సొంత అభిమానులు ఉండే వారు. ఇది అంత 1983 కి పూర్వం మాట. 1984 - 85 లో వీరు అందరు కొంచం వెనక పడ్డారు. అప్పుడు మన చిరంజీవి గారు ఆ లోటు ని భర్తీ చేస్తూ అప్పటి నుంచి ఒక వెలుగు వెలుగు తున్నారు. మెగాస్టార్ అనే దానికి సార్ధకత తెచ్చారు ఆయన నటన తో. అప్పట్లో యండమూరి గారు కొన్ని నవలలు రాశారు. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటివి, చిరంజీవి గారిని దృష్టి లో పెట్టుకుని. అందుకు తగ్గట్టె చిరంజీవి గారు కూడా వాటిల్లో నటించారు. అప్పటి నుంచి మన తెలుగు సినిమా మలుపు తిరిగింది. ఒక మూస పద్దతి లో నే ఉంటున్నాయి సినిమా లు. హీరొ కి ఉన్న ఆదరణ పట్టి మాస్ ఫాలోఇంగ్ ని పట్టి కధలు తయారు అవ్వటమ్ మొదలు అయ్యింది. ఇంతలో నాగేశ్వర రావు గారి అబ్బాయి నాగార్జున, రామ నాయుడి గారి అబ్బాయి వెంకటేష్ అమెరికా నుంచి ఇండియా కి తిరిగి వచ్చి సినిమా ల్లో నటించటం మొదలు పెట్టారు. వాళ్ళకి కూడా ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. నాగార్జున మనకి ఉన్న హీరొ లలో మంచి అందగాడు, కొత్త దనాన్ని ప్రోస్థాహిస్తూ మంచి సినిమాలు తీయ్యటం మొదలు పెట్టారు. కానీ ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలం వల్ల ఆయన కూడా కొన్ని మాస్ సినిమా లు చేశారు. అవి పెద్ద విజయం సాధించాయి. ఇక వెంకటేష్ గారు కొన్ని మాస్ సినిమా లు చేస్తూ నే శొభన్ బాబు గారు చేసిన తరహా సినిమా లు కుటుంభ కదా చిత్రాలు చేశారు. ఇక్కడ మన బాల కృష్ణ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన కూడా చాలా రోజుల నుంచి అంటే అన్న గారు ఉన్నప్పటి నుంచే సినిమా ల్లో నటిస్తూ ఉన్నారు. కానీ ఆయనది అంతా నాటు పద్దతి. ఇక ఆయన దశ తిప్పిన చిత్రం సమరసింహరెడీ. అప్పటి నుంచి ఆయన అలాంటి మూస సినిమాలే చేస్తూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ హీరొ లు అందరు కూడా నిర్మాతలని వాళ్ళకి తగ్గ కధలు తయారు చేయించి అలాంటి సినిమా లు తీయ్యమంటు, అలా చేసిన వాళ్ళకే డేట్స్ ఇస్తూ ఒక విష వలయం లో చిక్కుకుని పోయారు. ముఖ్యం గా చిరంజీవి గారు, బాల కృష్ణ గారు. ఈ సమయం లో నే కళా తపస్వీ విశ్వనాథ్ గారు, తెలుగు వెలుగు బాపు గారు, హాస్య బ్రహ్మ జంధ్యాల గారు, అపర మేధావి బాలుచందర్ గారు, భారత దేశం మొతం గర్వించ తగ్గ డైరెక్టర్ మణిరత్నం గారు కూడా మంచి మంచి సినిమా లు తీశారు మన తెలుసు లో. కానీ వారు తీసిన కొన్ని గొప్ప సినిమా ల్లో పైన చెప్పిన హేరోలు చేసినవి కొన్ని మాత్రమే. చాలా మటుకు కమల్ హసన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, లేదా వేరే వాళ్ళు చేసిన వి ఉన్నాయి. అసలు చెయ్యలేదు అని కాదు కానీ నాకు తెలిసి సంతృప్తి తో చేసినవి మాత్రం కాదు. ఒక రుద్రవీణ, స్వయం కృషి, శృతిలయలు,గీతాంజలి లాంటి అపురూపమిన చిత్రాలు ఉన్నాయి కానీ సంవత్చారానికి 100+ సినిమాలు వచ్చే మన తెలుగు లో చెప్పుకోటానికి కొన్ని మాత్రమే గొప్పవి, ఇది అంతా 1983 తరువాత మాట. ఇక 1998 - 2000 తరువాత కుర్ర హీరొ ల గోల మొదలు అయ్యింది. ఇందులో ఎక్కువగా పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు. వీరు కూడా వాళ్ళ వాళ్ళ పెద్దల పద్దతి లో నే మాస్ సినిమా లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మన చిరంజీవి గారి తో ఒక వింత పద్దతి మొదలు అయ్యింది. ఒక్కడే వంద మందిని అయినా కొత్తగలిగిన వాడు హీరొ అనే ముద్ర పడిపోయింది. ఇక మన వాళ్ళు సినిమా కి వెళితే అలా కొట్ట లేని హీరొ హీరొనే కాదు అనుకోవటం మొదలు పెట్టారు. ఇహ మన బాలకృష్ణ గారు కంటి చూపు తో, తోడ కొట్టి ఛంపటం, పన్ను తో బుల్లెట్ పేల్చాటం లాంటి వింత చేష్టలు చేస్తూ ఒక రకమయిన హింస పెట్టె వారు జనాలని. అయినా మన వాళ్ళు అవి కూడా బాగానీ ఆస్వాదించారు / అనుభవించారు అనుకోవాలి.
ఇక అసలు విషయం చెప్ప వలసి ఉంది ఇక్కడ..
మొన్న ఎన్నికల్లో మెగా స్టార్ చిరంజీవి గారు ఒక కొత్త పార్టీ పెట్టి పోటీ చేసి అనుకున్న అన్ని స్టానాలు గెలవక పోయినా శాసనసభ్యుని గా అసెంబ్లీ లో కూర్చున్నారు. కానీ అందుకు జరిగిన కొన్ని సంఘటనలు వింత గా ఉన్నాయి. మీరు పవన్ కల్యాణ్ సినిమా లు చూసి ఉంటే ఆయన ని సినిమాల్లో ఎలా చూపిస్తారో ఊహించుకోండి. ఆయన మొదటి సినిమా లో ఆయన చేతులు మీదగా కారు వెళ్ళటం, తమ్ముడు సినిమా లో కొన్ని రోజుల్లో నే కిక్ బాక్సింగ్ నేర్చుకోవటానికి ఆయన పడే శ్రమా, ఇక జల్సా లో ఉన్న ఒక పాట, "హైట్ ఎంతో కొలవాలి అనుకుంటే అమాంతము ఎవరెస్ట్ అయ్యీ వస్తాడు" అని ఉంటుంది. ఆ పాటలు విన్నప్పుడు ఆయన ఫైట్స్ చూసినప్పుడు ఒక రకమైన వింత అనుభూతి పొందే వాడిని. కానీ మొన్న ఎన్నికల ముందు ఒక సభ లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఏదో జరిగి కింద పడిపోయాడు. ఎంటా అని చూస్తే
3 రోజులు వరసగా ఎండల్లో సభలకి వెళ్లే సరికి తల తిరిగి కింద పడి పోయాడు. ఇంకో సభ లో చూసుకోకుండా చెయ్యి ఎత్త గానే కరెంట్ షాక్. ఇదే పెద్ద మనిషి ఒక సినిమా లో ట్ర్యాన్స్‌ఫార్మర్ ని కూడా పేల్చి వేశాడు చేతి తో. ఆయన అలా కింద పడటం ఒక మనిషి గా బాధ అనిపించినా సినిమా ల లో మనలని ఎంత వెర్రి వాళ్ళని చేస్తున్నారో అర్ధం అయ్యింది. ఇక ఇంకో సంఘటన. మన జూనియర్ ఎన్.టీ.ఆర్ ఖమ్మం లో జరిగిన సభ లో మాట్లాడి హైదరాబాదు వస్తూ మధ్య లో కారు కి ఆక్సిడెంట్ అయ్యింది. ఆది పెద్ద వార్త్త. అసలు జరిగింది ఏంటి అంటే ఖమ్మం లో పెద్ద గొడవ పెట్టుకుని కోపం లో కొంచం తీర్ధం పుచ్చుకుని కారు తొలాడు. అందుకు నిదర్శనం మన ఖమ్మం శాసన సభులు తుమ్మల నాగేశ్వర రావు గారు. ఆయన వద్దు అని ఎంత వారించినా వినకుండా హైదరాబాదు తనే స్వయం గా కారు నడుపుతూ బయలుదేరాడు . కానీ ఒక కుక్క అడ్డు రాగానే కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. ఇదే హీరొ గారు ఒక సినిమా లో, అశోక్ అనుకుంటా, 30 కారులు, 10 లారీ లు, 100 మోటరు సైకల్ లు మీద ఉన్న విలన్లతో పోట్లాది ఒక చిన్న పిల్ల వాడిని కాపాడాడు. "ఆది" సినిమా లో తోడ కొత్త గా నే ట్ర్యాక్టర్ పేలి పోయింది. సాంబ సినిమా లో చావుని కూడా తేలికగా జయించగలిగాడు. కానీ నిజ జీవితం లో మాత్రం 3 వారాలు హాస్పిటలు బెడ్ మీద పడుకున్నాడు. మన మహేష్ బాబు గారు పోకిరి లో ఎంత మందిని కొట్టాడు? ఒకే ఒక్కడు లో ఒక అమ్మాయిని కాపాడడు, ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు చేశాడు చిన్నప్పటి నుంచి(కృష్ణ గారి సినిమా ల్లో కూడా మహేష్ చిన్నప్పుడు చాలా మంది విలన్స్ ని చితకా కొట్టాడు). కానీ ఆయన పెళ్లి విషయం వచ్చే సరికి ఇంట్లో గొడవ, పెద్దలు ఒప్పుకోలేదు, పెళ్లి అయ్యాక కూడా ఆయన సంసారం పెద్ద గొప్ప గా లేదు. ఆది కూడా మామూలు జనాల లాగానే ఆయన పరిస్థితి కూడా. అలాగే జగపతి బాబు ఒక సారి విడాకుల దాకా వచ్చి చంద్ర బాబు గారి జోక్యం తో మళ్లీ నిలబడగలిగాడు. బాల కృష్ణ గారు వెర్రి కోపం తో బెల్లం కొండ సురేష్ ని కాల్చి తరువాత ఆ కేసు నుంచి బయట పడటానికి ఎన్ని పాట్లు పడ్డాడో మన అందరికి తెలుసు. చిరంజీవి గారు అత్త కి ఏముడు అమ్మాయికి మొగుడు సినిమా లో ఒక పెళ్లి కూతురు ని పెళ్లి పీటల మీద నుంచి లేపుకుని వెళ్ళి ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయి తో పెళ్లి చేశాడు కానీ నిజ జీవితం లో మాత్రం ఆయన కూతురు అలా చేస్తే కన్నెళ్ళు పెట్టుకున్నాడు, ఎంత సీన్ చేసారో మన అందరికి తెలుసు. సినిమా ని ఒక సినిమా ల గా నే చూస్తే మనకి ఇవి అన్ని పెద్ద విషయాలు కాదు. ఎవరి జీవితం వారిది. కానీ మన సమాజం లో సినిమా అన్నది మన జీవితాల్లో ఒక బాగం. అందులో హీరొ లు మనకి ఆదర్శం. నాకు తెలిసి ఒక వయసు వచ్చినప్పటి నుంచి మనం హీరొ ల ని అనుకరించాము. మన వేషం, బాష కూడా వారు చేసినట్టు మార్చుకున్నాము. ఒక ఉదాహరణ ఇక్కడ. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ వచ్చిన కొత్తలో బాక్స్ బధలు అవుతుంది, ఫేసు టర్న్నీంగ్ ఇచ్చుకో అన్న పదాలు ఎంత లా జనాలు వాడారో అందరికి తెలుసు. హీరొ లు చేసుకునట్టు జుట్టు పెంచుకోవటం, కత్తిరించుకోవటం, నడక, అమ్మాయిల ని ఫాలొ చెయ్యటం, ఇలా ఒక్కాటేమిటి చాలా ఉన్నాయి. అమ్మాయిలు కూడా సినిమా హీరొఇన్నులు వేసుకునే డ్రెస్ లు చీరలు అలంకరణ అన్ని పాటించటం, అన్ని చేస్తూ నే ఉంటారు.
ఇలాంటి హీరొలు చేసే ఒక్కో సినిమా కి ఖర్ఛు ఎంత అవుతుందో మనకి తెలుసు. అందులో ఎక్కువ బాగం హీరొ గారికి సమర్పించే దే. ఇప్పుడు ఉన్న రాటు ప్రకారం జూనియర్ ఎన్.టీ.ఆర్ 7 కోట్లు ఆట, మహేష్ బాబు కూడా అంతే. పవన్ గారు అటు ఇటు గా 6 కోట్లు ఆట, నాగార్జున గారు కూడా అంతే.

మొన్న జరిగిన ఎలెక్షన్ ల తరువాత నుంచి వీరు చేసే సినామాలకి వాళ్ళకి అంత ఇవ్వవచ్చా, వాళ్ళు నటించే సినిమా లు చూడటం అంత అవసరమా అనే ప్రశ్న వచ్చిందీ.

వీళ్ళు అందరు మనకి వెండి తెర వెనుక కనపడితే నే అందం, వారికి కూడా అదే మంచిది. లేక పోతే వారు కూడా మన లాంటి వారే అనే ఒక అభిప్రాయం కానీ జనాలకి ఏర్పడితే సినిమాలు చూడరు.

ప్రశ్న వేసుకోవటం వరకే కానీ మళ్లీ మంచి సినిమా వస్తే నేను కూడా ఇవి అన్ని పక్కన పెట్టి మళ్లీ టికెట్ తీసుకుని సినిమా కి పరుగె పరుగు.....

Thursday, July 9, 2009

ఒక్క సారి ఆలోచించండి...


మానవ జన్మ ఎత్తటం అంటే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే సాధ్యం అని పెద్దలు చెప్పారు. సృష్టి లో ఎన్నో జీవులు ఉన్నా మానవ జన్మ కి ఉన్న గొప్పతనం వేరే దేనికి లేదు అన్నది సత్యం. ఎప్పుడో ఒక చిన్న ప్రాణి ఏదో తెలియని రూపం లో ఈ భూమి మీద అవతారం ఎత్తి ఆది మానవునిగా అవతారం ఎత్తటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. మనిషి కి ఉన్న గొప్పతనం అంతా మన మన మాటలు, హావ భావాలు, మన నడవడిక, మనం సమాజం అనే దానిలో ఒదిగి ఉండటం, కొన్ని కట్టుబాట్లు కి లోబడి సహజీవనం సాగించటం లోనే ఉన్నది. ఈ రోజు మనం ఉన్న స్తితి కి రావటానికి ఎంత కృషి ఉందో తెలుసువోవాలి. యెప్పుడో మన పూర్వీకులు గురించి కూడా అవసరం లేదు, మన తాతలు, తల్లి తండ్రి ఎలా జీవించారో ఆలోచించినా తెలుస్తుంది బతకటం ఏంటో. వారు బ్రతకటానికి, జీవించటానికి పడ్డ కష్టం ముందు మనం పడ్డవి అస్సలు లెక్క లో కి రావు. తిండి లేక పోతే పస్తుల్ ఉన్నారు, వ్యవసాయం చేసుకుని, పండినప్పుడు తింటూ, వాతావరం అనుకూలించక పోయినప్పుడు కష్టాలు పడ్డారు. కానీ అంత కష్ట పడీఈ తరాన్ని తీర్చి దిద్దారు. ఈ తరం, అంటే ఇంకా 40 -45 సంవత్సరాలు దాటని వాళ్ళు చూసిన జీవితం వేరు. అన్ని అందుబాటు లోకి వచ్చి ఏది కావాలంటే ఆది దొరికే స్తితిలో ఉన్నాము మనము. అన్ని అందుబాటులో ఉంటే జీవితం విలువ తెలియదు అని మన పెద్దలు మొదటి నుంచే చెపుతూ ఉంటారు. ఆది నిజం. ఈ రోజు చిన్న చిన్న పిల్లలు కూడా జీవితం వ్యర్ధం అనో, ఇంకా ఈ బ్రతుకు బ్రతకలేను అనో, అనుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రోజు పేపర్ చూసినా, వార్తలు విన్న ఎక్కడో అక్కడ ఇలాంటి వార్త లే వింటున్నాము. ప్రాణం తీసుకోవటం ఎంత తేలికో ప్రాణం నిలపెట్టటం అంత కష్టం. క్షాణికావేశానికి లోను అయ్యీ తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే అనర్ధాలు ఇవి. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని చనిపోతున్నారు. మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు వాళ్ళ ప్రతిభ కి. కానీ ఈ రోజున వాటినే చూస్తూ వాటి గురించే చదువుతూ అవి ఏ మాత్రం తగ్గినా వెర్రి ఆలోచనలతో చనిపోతున్నారు చిన్న పిల్లలు. అలా చనిపోయిన వాళ్ళదే తప్పు కాదు, ఆ పరిస్థితి కల్పించిన వారి అందరిది. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి మార్కులు తక్కువ వస్తే మొహం ఎత్తుకుని బ్రతకలేము అని అనుకుంటారు తప్ప వాళ్ళకి ఎందుకు తక్కువ వచ్చాయి అనే దాని గురించి ఆలోచించారు. ఏదో ఒక ట్యూషను పెట్టటం, ఎక్కువ డబ్బులు తీసుకునే కాలేజ్ లో చేర్పించటం, ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని పిల్లల మీద రుద్దటం. నిజంగా పిల్ల వానికి చదువుకోవాలి అనే కోరిక ఉంటే అన్ని చెయ్యవచు. అందుకు వాళ్ళు కూడా సిద్దం గానే ఉన్నారు. కానీ అందరు పిల్లలు ఒకే లా ఉండరు. కొందరికి చదువు అంత గా నచ్చదు, ఆటల మీద ఆశక్తి ఉంటుంది, వేరే రంగం లో రాణించాలని ఉంటుంది. అలాంటి పిల్లలిని ఎంత కష్టపెట్టినా ఫలితం ఉండదు. వారి మనసు తెలుసుకుని వారికి ఇష్టం ఉన్న దాంట్లో ఉంచితే వారు తేలికగా అందులో కూడా మంచి పేరు తెచ్చుకోగలరు.

ఇక ఇంకో రకమిన పరిస్థితి. ఈ మధ్య మన దేశం లో మన పెద్దలు ఎవరు చూడని డబ్బు ఈ తరం వాళ్ళకి అందుబాటు లో ఉంటుంది. IT వల్ల అందరికి పెద్ద పెద్ద జీతాలు, వాటికి తగ్గట్టుగానే కోరికలు. ఆ కోరికలు కూడా కష్టాలకి మూలం. మన IT అంత అమెరికా తుమ్మితే ఊడి పోయే రకం. అమెరికాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర లో IT బాగు పడటానికి చాలా రోజులు పడుతుంది, మళ్లీ తిరిగి పాత రోజులు మాత్రం తిరిగి రావు అన్నడి మాత్రం సత్యం. IT నే మనకి పెద్ద పరిశ్రమ కూడా. కానీ అందులో ఉద్యోగం రాలేదనో ఉన్న ఉద్యోగం పోయింది అనో చని పోతున్నవారు కూడా ఎక్కువ అయ్యారు ఈ మధ్య. నిజం చెప్పాలి అంటే అలాంటి వాళ్ళు బతకటం కష్టం కాదు. మన సమాజం లో బ్రతకటానికి కావలసిన చదువు వారి దగ్గర ఉంది. కావలసింది కొంచం ఓర్పు, సహనం. మనం ఇన్ని రోజులు పట్టించుకొని మార్గాలు చాలా ఉన్నాయి మన చదువు కి మంచి గౌరవం ఇచ్చి బ్రతకటానికి కావలసినంత డబ్బులు ఇవ్వటానికి. ఇప్పుడు చాలా ఇంజనీరింగు కాలేజ్ లు వచ్చాయి. అందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక పై చదువు లు చదవ వచ్చు, MS,PHD లాంటివి చేస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకమైన జాబ్ దొరుకుతుంది. కావలసింది మన గట్టి ప్రయత్నం, ఓపిక, సహనం. చనీపోదాం అనుకునే ముందు మన తల్లితండ్రులని ఒక్క సారి తలుచుకోవాలి. ఎంత కష్ట పడి, ఉన్నప్పుడు తిని లేనప్పుడు కూడా మనకే పెట్టి ఇంత పెద్ద వల్ల ని చేసిన వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటున్నారో.

ఇంకో రాకమైన పిచ్చి. ఈ రోజుల్లో ప్రేమ విఫలం అయ్యీ చనిపోవటం, ప్రేమించామని బలవంత పెట్టినందుకూ చనిపోవటం, పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారు అని, తాను ప్రేమించన వాడు/ఆమె వేరే వాళ్ళ తో చనువు గా ఉంది అని ఇలా పనికి మాలిన కారణాల వల్ల చనిపోతున్నారు. ప్రేమించటం అనేది తప్పు కాదు కానీ ఆది మొదలు అయ్యే ముందు దాన్ని పర్యవసానాలు ఆలోచించుకోవాలి. అన్ని మనం అనుకూనట్టు జరగవు. దేనికినా రెండవ ప్లాన్ ఉండాలి. అంతే కానీ ఆత్మహత్యలకి పాలు పడటం ఎంత తప్పో ఆలోచించాలి. అలాంటి తప్పుడు ఆలోచన రాగానే ఒక మానసిక వైద్యుడిని కలవండి. అలాంటి ఆలోచనలు అన్ని మనల్ని శాశిస్తాయి. కానీ వాటిని అదుపు చెయ్యటం వాళ్ళకి తెలుసు అలాగే ఒక మంచి పని కి శ్రీకారం చుట్టండి. మీ పక్క వారికి కొంచమయినా సహాయం చెయ్యటం, చదువు లేని వాళ్ళకి మీకు తెలిసింది నేర్పించటం, మీ పెద్దలతో కుదిరినంత సమయం గడపటం, ఎవరితో ఒకరితో మీ మనుసు పంచుకోవటం, మీ బాధలు అన్ని విని మంచి సలహా ఇవ్వగలిగే వాళ్ళకి చెప్పి వారి సలహాలు పాటించటం, దైవ కార్యక్రమాలు చెయ్యటం ఇలా ఏదెనా సరే.

మనిషి గా పుట్టాటం ఒక అదృష్టం, దానిని మంచిగా జీవించటం మన కర్తవ్యం...


ఒక్క సారి ఆలోచించండి..........

Monday, July 6, 2009

mana desi consultancies gurinchi...


ఈ రోజు నేను రాయ బోయే విషయం మన వాళ్ళు నడిపే కన్సల్టెన్సీస్ గురించి.

నేను H1 మీద అమెరికా లో ఉంటున్నాను ఒక 5 yrs నుంచి. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టి కొన్ని రోజులు ఇండియా లో జాబ్ చేసి ఒక సారి అమెరికా లో కూడా ఏముందో చూద్దాం అనుకుని ఒక ఫ్రెండ్ ని హెల్ప్ అడిగాను ఎవరినా H ప్రోసెస్ చేస్తారా అని. తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ కి చెప్పి నా అప్లికేషన్ ప్రోసెస్ చేశారు. కొన్ని వీసా కష్టాలు, ఏడుకొండల వాడి దర్శనం తరువాత కొంచం కష్ట పడితే వీసా వచ్చింది. ఇక్కడికి రాగానే ఫ్రెండ్ ఇంట్లో ఉంది ఒక 2 నెలలు తరువాత జాబ్ లో చేరాను. అప్పటికీ నాకు ఇక్కడ కన్సల్‌టెన్సీ ల గురించి పెద్దగా తెలియదు. ఇక్కడికి వచ్చాక కొన్ని ఫార్మొలేటీస్ అయ్యాక జాబ్ వేట లో పడ్డాను. ముందు Resume Prepare చేసి మార్కెట్ లో కి వదిలి కాలు మీద కాలు వేసుకుని మనకి ఉన్న experience కి వాళ్లే పిలిచి జాబ్ ఇస్తారు లే అని అనుకున్నాను. కానీ ఒక 3 రోజులకీ ఏమీ రెస్పాన్స్ లేకాపోయే సరికి కొంచం షాక్ కొట్టి నేనే Dice, Mosnter లాంటి వాటిల్లో లో resume పెట్టాను. పర్వాలేదు కొన్ని కాల్స్ రావటం మొదలు అయ్యాయి. అప్పటికీ ఇంకా నాకు అమెరికా లో ఇంత మంది మన వాళ్ళు కంపనీస్ నడుపుతున్నారు అని తెలియదు. నాకు వచ్చిన ఒక కాల్ ఎత్తగానే ఒక ఆవిడ మాట్లాడుతూ "యూ నో C++ అన్నది", వచ్చు అన్నాను, "యూ నో Java" అన్నది, ఈ లిస్ట్ అంత ఎందుకు డైరెక్ట్ గా పాయంట్ కి వద్దాం అని నాకు 8 yrs ఎక్స్‌పీరియెన్స్ ఉంది C++,జావా,J2EE అండ్ ఇంటెర్నెట్ టెక్నాలజీస్ మీద అన్నాను. తాను మళ్లీ "యూ నో Java" అన్నది. సరే లే గొడవ ఎందుకు అని వచ్చు అన్నాను, అలా ఒక 10 టెక్నాలజీస్ మీద యూ నో అని లాస్ట్ కి Do you have కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది. నాకు అర్ధం కాలేదు. అంటే అని నేను తిరిగి అడిగాను. Do you have కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మళ్లీ. మరి నేను మీతో ఇప్పటిదాకా మాట్లాడిన దానిని ఏమంటారు అన్నాను. ఈ వాంట్ ఆన్సర్స్ ఇన్ Yes or NO అన్నది. సరే లే గొడవ ఎందుకు, అవసరం మనది కదా అని yes అన్నాను. How do you rate your self in కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ 1 - 10 అన్నాను. మనం మాట్లాడే బాష ని మనమే కొలుచుకోవటం ఎంతో అర్ధం కాక పోయినా నేను 8 / 10 అన్నాను. "Can i say 9.5/10" అన్నది. నాకు అర్ధం కాలేదు. మనం మాట్లాడే బాష కి 9.5 ఎలా విలువ కడతారో. సరే నీ ఇష్టం అన్నాను. Can you explain some thing about you అన్నది. ఎక్కడో నేర్చుకున్న ఒక చిన్న essay ని ఒప్ప చెప్పాను. ఓక్ అని క్ల్లెంట్ కి పంపిస్తాను, you can expect a కాల్ ఫ్రమ్ మిస్టర్. రెడీ అన్నది. అప్పటికీ కానీ నాకు అర్ధం కాలేదు నన్ను ఇన్ని క్వెస్చన్స్ అడిగిన ఆవిడ ఒక లేయర్ అని. సరే లే అనుకున్నాను. ఒక గంట తరువాత ఆ మిస్టర్.రెడీ కాల్ చేసి మళ్లీ అవే ప్రశ్నలు రిపీట్ చేశాడు. అన్ని అయ్యాక నేను మా client ki ఫార్వర్డ్ చేస్తాము, expect a కాల్ ఫ్రమ్ them అన్నాడు. సరే లే అనుకుని ఎదురు చూస్తూ ఉంటే ఒక అమెరికన్ కాల్ చేసి 5 నిమిషాల్లో లో సో & సో client కి ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పాడు. client కి వెళ్లే సరికి ఒక రోజు అయ్యింది. అలాగే ఇంటర్‌వ్యూ సెట్ అయ్యింది, అక్కడ కూడా మన దేశీ నే కాల్ చేసింది. టెక్నికల్ గా సౌండ్ అనుకుంటా బంతి ఆట ఆడుకుని వీడికి అంత సీన్ లేదులే అనుకుని ఒక గంట తరువాత వదిలేసాడు. అప్పటికీ కానీ నేల కనపడలేదు. ఇక మళ్లీ స్టార్ట్ చేశాను జాబ్ వేట. సరే కొన్ని రోజులకీ ఇక్కడి వాతావరణం, భాష కొంచం అలవాటు అయ్యీ కొంచం కంగారు తగ్గించుకుని ఒక ఇంటర్‌వ్యూ కొట్టాను. మళ్లీ కొంచం భూమి పైన నడవటం స్టార్ట్ చేశాను. మనకేంటి లే ఇంకా లైఫ్ సెట్ అన్న ధీమా. కానీ ఒక గంట తరువాత కానీ నాకు అర్ధం కాలేదు ఆది ఎంత తప్పో. ఈ ఇంటర్‌వ్యూ కి కూడా 2 లేయర్స్ మా ఎంప్లాయర్ కాకుండా. ఒకరి దగ్గరి నుంచి మా ఎంప్లాయర్ కి పేపర్స్ వచ్చి అన్ని సెట్ అయ్యాక కానీ అర్ధం కాలేదు రేట్ ముందే మాట్లాడుకోవాలి అని. తీరా అక్కడి దాకా వచ్చాక తెలిసింది నేను పని చెయ్యబోయేది పల్లీలు(పీనిట్స్) కొన్నుక్కో టానికి కూడా పనికి రాదు అని. ఎంత ట్రై చేసినా ఎవరు ఒప్పుకోలేదు వల్ల ప్రాఫిట్ తగ్గించుకోటానికి. సరే లే అని జాబ్ లో చేరాను. అక్కడ ఒక దేశీ ఫ్రెండ్ తగిలాడు. నా గోడు అతనికి చెప్పాను ఇలా తక్కువ కి పని చేస్తున్నాను అని, కానీ అతను తన స్టోరీ చెప్పాక అర్ధం అయ్యింది. రోలు వెళ్ళి రోకలితో మొర పెట్టుకుంది అని. నాకంటే దారుణం అతని పరిస్తితి.

అప్పుడు స్టార్ట్ చేశాను కన్సల్టెన్సీస్ గురించి తెలుసుకోవటం. మన దేశీలు నడిపే వాటి గురించి. నమ్మలేని నిజాలు అనేవి ఏవి అయినా ఉంటే అందులో ఇవి కూడా ఒకటి.

మన వాళ్ళు అమెరికా కి రావటం ఎక్కువగా 1996-2000 మధ్య లో స్టార్ట్ అయ్యింది. ఆ రోజుల్లో ఇంటర్మీడియేట్ ఫేల్డ్ కూడా ఒక 15 డేస్ క్ర్యాష్ కోర్స్ చేసి అమెరికా కి వచ్చారు. అవసరం అలాంటిది అప్పుడు ఇక్కడ. అలా వచ్చిన వాళ్ళలో కొంత మంది బతక నేర్చిన వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసి వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్చుకుని ఇక్కడ ఉన్నలూప్ హోల్స్ ని పట్టుకుని చిన్న చిన్న గా సెట్ అయ్యారు. అలా అని అన్ని కన్సల్‌టెన్సీ వాళ్ళు తక్కువ చదువు కున్నా వాళ్ళు కాదు. BTECH,MS చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కన్సల్‌టెన్సీ పెట్టక ఇక్కడ ఉన్న జనాల కొరత ని అర్ధం చేసుకుని ఇండియా లో ఉన్న మన వాళ్ళకి హ్1 లు చేసి ఇక్కడికి రప్పించటం స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కొన్ని కన్సల్టెన్సీస్ లో 100+ మంది ఉన్నవి చాలా ఉన్నాయి. వాటి మంత్లీ ప్రాఫిట్స్ ఎంత లేదు అన్న $200,000+ ఉంటుంది. చూడండి మన ఇండియన్ రుపీస్ లో దాని వ్యాల్యూ. కోట్లు సంపాదించారు.

మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటే పర్వాలేదు, వ్యాపారం అనుకున్న కొంచం ఎతిక్స్ ఉన్న పర్వాలేదు. అసలు అమెరికన్ కంపనీస్ ఎప్పుడు వీసా ప్రోసెస్ చెయ్యటానికి డబ్బులు అడగవు కానీ మన వాళ్ళు లాయర్ ఖర్చుల దగ్గరి నుంచి అన్ని కట్టించుకుంటారు. ఒక $1800 నుంచి $2000 అవ్వ వలసిన దానికి $3000 తీసుకుంటారు. సరే లే మనకి అమెరికా వెళ్ళటం కదా ముఖ్యం అనుకుని మనం కట్టేసి పేపర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చేస్తే కొన్ని కన్సల్టెన్సీస్ మీద ఉన్న కేస్ ల వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే వీసా కి వెళితే రిజెక్ట్ అవుతుంది కంపనీ మంచిది కాదు అని, ఇక అవతల కంపనీ వాళ్ళు ఎంత కాల్ చేసినా మేల్స్ పెట్టిన రెస్పాండ్ ఆవ్వరు. కొంతమంది అన్ని శకునాలు దాటుకుని అమెరికా లో అడుగు పెట్టగానే కన్సల్‌టెన్సీ వల్ల గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళతారు. అందులో ఏ లోపం ఉండదు పాపం. వెళ్ళాక నాలాగే జాబ్ సర్చ్ స్టార్ట్ చేస్తారు. చాలా సార్లు వల్ల కి వచ్చే కాల్స్ అన్ని కూడా ఎంప్లాయర్ దగ్గర ఫిల్టర్ అయ్యకే వస్తాయి. సో ఎట్టి పరిస్తితుల్లో కూడా రేట్ ఎంతో చెప్పారు. ఇక్కడికి వచ్చాక 70%-30% కావాలా జీతం కావాలా అని ముందే అడుగుతారు. జీతం అంటే ఎక్కడ తక్కువ వస్తుందో అని 70%- 30% అంటాము ఆశ చావాక. అక్కడే పప్పులో కాలు వేసేది. ఎలాగూ రేట్ తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్ మీద 70% అంటారు. ఇంకా ఘోరం ఏంటి అంటే కొన్ని సార్లు సర్విస్ ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని అందులో నే కలుపుతారు. ఇక మనం జాబ్ లో చేరగానే ఎలాగూ మనకి తెలుస్తుంది మన కి ఎంత పే చేస్తున్నారో క్లైంట్, తెలిసినా ఏమీ పీక లేము ఎందుకంటే మన H1 వల్ల చేతుల్లో ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మన రక్తాన్ని పిండటం. H1 ఎక్స్‌టెన్షన్స్ కి మనమే కట్టాలి డబ్బులు. paid leaves ఎలాగూ ఉండవు. కొంత మంది బెంచ్ లో మినిమమ్ కూడా పే చెయ్యరు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎంత కష్టమో వాళ్ళకే తెలుసు. ఈ మధ్య బయట జాబ్స్ కష్టం గా ఉండటం వల్ల గెస్ట్ హౌస్ అనే ఫేసిలిటీ ని కూడా తీసేసారు. రెండు లేక మూడు నెలలు జాబ్ లేక పోతే ఇండియా కి వెళ్ళిపొమ్మంటున్నారు. ఎంతో మందికి H1 రివోక్ కూడా చేశారు.

ఇక గ్రీన్ కార్డు మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి అదొక పెద్ద నరకం. అందులో అన్ని మనమే పెట్టుకోవాలి. ఒక $6000 కావలిసిన దానికి ఎంత లేదు అన్న $8000 చేస్తారు మన కన్సల్‌టెన్సీ వాళ్ళు. సరే ఏదో అయ్యింది అనుకున్న అమెరికా వాళ్ళు అంత తేలికగా లా లేరు గ్రీంకార్డ్స్. ఎంత లేదు అన్న మినిమమ్ 5 పడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.మన వాళ్ళు ఎంత సిద్దాహస్తులో. నాకు తెలిసిగ్రీన్ కార్డ్ ఒక పెద్ద విష వలయం. ఒకే లేబర్ ని 25 మందికి అమ్ముకుని డబ్బులు చేసుకున్న ధౌర్భాగ్యులు ఉన్నారు. ఒక ఈ140 ని చాలా మందికి అమ్ముకుని కోట్లు సంపాదించారు. మొన్న వెలుగు చూసిన ఒక కేసు లో కి వెళితే బోస్‌టన్ లో మన వాళ్ళు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. నేను పైన చెప్పిన వి అక్కడే జరిగాయి. ఇన్ని ఘోరాలు చేసిన ఒక పెద్ద మనిషి ఇంటికి ఒకసారి నేను వెళ్ళాను. ఇల్లు కాదు ఆది ఇంధ్ర భవనం అనాలి. ఇంట్లో ఉన్న వి అన్ని గోల్డ్ ప్లేటెడ్ అంటే ఎంత వైభవమో ఆలోచించండి. దిగితే Lexus or BMW, Business class flight ,ఇండియా లో ఎక్కడికి వెళ్ళినా రాజా భొగం, ఎన్నో చారిటీ వేషాలు ఇండియా లో. తీరా ఇక్కడ అధికారులు కొన్ని నిజాలు తెలుసుకుని ఆ కన్సల్‌టెన్సీ ని క్లోస్ చేశారు. కన్సల్‌టెన్సీ ఇద్దరి పేరు మీద ఉంది, అతను అతని వైఫ్ ని జైల్ లో పెట్టారు. అతని కన్సల్‌టెన్సీ ద్వారా గ్రీన్ కార్డ్ పొందిన వాళ్ళని కూడా బ్ల్యాక్ లిస్ట్ లో పెట్టారు. పాపం కొందరు తెలియక కూడా అందులో కూరుకున్నారు. ఇంకా పాపం ఏంటి అంటే వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు అమెరికా కస్టడీ లో ఉన్నారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనక కాలువ లో పడి చచ్చినట్టు ఉంది వల్ల పరిస్తితి.

జాబ్ ఒక దగ్గర చేస్తూ LCA ఇంకో దగ్గర చెయ్యటం, జాబ్ ఇంటర్‌వ్యూ కోసం ఫోన్ ఫార్వర్డింగ్, వాళ్ళ క్యాండిడేట్ కి హెల్ప్ కోసం వేరే వాలని ముందు ఇంటర్‌వ్యూ కి పంపించి క్వెస్చన్ ప్యాటర్న్ తెలుసుకోవటం, ఒకే కంపనీ 2 లేక 3 లేయర్స్ కింద పెట్టి అసలు క్యాండిడేట్ కి తక్కువ ఇవ్వటం, కొందరు clients పే చేసే వరకు పే చెయ్యక పోవటం, చెప్ప పెట్టా కుండా కొన్ని నెలలు జీతం ఇవ్వక పోవటం ఇలా చాలా ఉన్నాయి మన వల్ల కళలు.

ఇంకో కేసు లో ohio లో ఉన్న ఒక అమెరికన్ గవర్న్‌మెంట్ ఎంప్లాయీ కి మన వాళ్ళు ఆశ చూపి అతని దగ్గర కొన్ని లెటర్ హెడ్స్ మీద సంతకాలు తీసుకుని వాళ్ళ కన్సల్టెన్సీస్ లో హ్1 వచ్చిన వాళ్ళకి క్లైంట్ లెటర్ కింద అవి ఇచ్చారు. మన వాళ్ళు వెళ్లేది చెన్నై కన్సల్‌టెన్సీ కి. అసలే వాళ్ళు పెద్ద మూదుర్లు. మన హైదరాబాదు వాళ్ళతో సహవాసం చేసి ఎలాంటి తప్పు అయినా తేలిక గా పట్టుకునే స్టేజ్ కి ఎదిగారు. అమెరికన్స్ ప్రకారం చెన్నై కన్సల్‌టెన్సీ లో జరిగిన అంత పరీక్ష వేరే ఏ దేశాల్లో జరగదు ఆట, ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో లో కూడా. వాళ్ళకి ఈ మోసం తెలిసి ట్రాప్ వేసి అందరినీ పట్టుకున్నారు. ఇక ఇప్పుడు అందరి పరిస్తితి కుడితి లో పడ్డ ఎలుక లా అయ్యింది మన వాళ్ళు చేసిన తప్పులకి. అసలే రిసెషన్ అందులో ఇలాంటి తప్పులు దొరికే సరికి టైట్ చేశారు అమెరికా వాళ్ళు.

ఎంతో మంది మీద కేసు లు వేశారు ఇప్పుడు. చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు కొందరు, మిగిలిన వాళ్ళు భయ భయపడుతున్నారు ఎప్పుడు వాళ్ళవంతు వస్తుందో అని. ఇక ఇంకో విషయం ఏంటి అంటే అమెరికా వాళ్ళు టెస్టింగ్ జాబ్ కి తేచింకాల్ ఎక్స్‌పీరియెన్స్ అవసరం లేదు అని మార్చారు. అంటే దానికి హ్1 ఉండవలసిన పని లేదు. ఇక్కడ 10+ చదువు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుని టెస్టింగ్ జాబ్ చేయ వచ్చు. ఇలా కొన్ని జాబ్స్ ని అలాంటి కెటెగరీ లో కి పెట్టటానికి ఆలోచిస్తున్నారు ఆట. ఆది కూడా మన వాళ్ళ కి పెద్ద దెబ్బ. ఇక ఒక కంపనీ కి H1 మీద వచ్చి వేరే కంపనీ కి కన్సల్టెంట్స్ గా పని చెయ్యకూడదు అని ఒక రూల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆట.ఆది కానీ జరిగితే ఇక H1 మీద ఉన్న వాళ్ళు అందరు దుకాణాలు ఎత్తి ఇండియా వెళ్ళవలసిందే.

ఇంత చెప్పిన నేను మాత్రం ఈ విషయం లో కొంచం హ్యాపీ. మా ఎంప్లాయర్ డబ్బులు తీసుకోరు H1 కి, ext కి. కొంచం నిజాయితీ గా ఉంటారు.