
మానవ జన్మ ఎత్తటం అంటే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే సాధ్యం అని పెద్దలు చెప్పారు. సృష్టి లో ఎన్నో జీవులు ఉన్నా మానవ జన్మ కి ఉన్న గొప్పతనం వేరే దేనికి లేదు అన్నది సత్యం. ఎప్పుడో ఒక చిన్న ప్రాణి ఏదో తెలియని రూపం లో ఈ భూమి మీద అవతారం ఎత్తి ఆది మానవునిగా అవతారం ఎత్తటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. మనిషి కి ఉన్న గొప్పతనం అంతా మన మన మాటలు, హావ భావాలు, మన నడవడిక, మనం సమాజం అనే దానిలో ఒదిగి ఉండటం, కొన్ని కట్టుబాట్లు కి లోబడి సహజీవనం సాగించటం లోనే ఉన్నది. ఈ రోజు మనం ఉన్న స్తితి కి రావటానికి ఎంత కృషి ఉందో తెలుసువోవాలి. యెప్పుడో మన పూర్వీకులు గురించి కూడా అవసరం లేదు, మన తాతలు, తల్లి తండ్రి ఎలా జీవించారో ఆలోచించినా తెలుస్తుంది బతకటం ఏంటో. వారు బ్రతకటానికి, జీవించటానికి పడ్డ కష్టం ముందు మనం పడ్డవి అస్సలు లెక్క లో కి రావు. తిండి లేక పోతే పస్తుల్ ఉన్నారు, వ్యవసాయం చేసుకుని, పండినప్పుడు తింటూ, వాతావరం అనుకూలించక పోయినప్పుడు కష్టాలు పడ్డారు. కానీ అంత కష్ట పడీఈ తరాన్ని తీర్చి దిద్దారు. ఈ తరం, అంటే ఇంకా 40 -45 సంవత్సరాలు దాటని వాళ్ళు చూసిన జీవితం వేరు. అన్ని అందుబాటు లోకి వచ్చి ఏది కావాలంటే ఆది దొరికే స్తితిలో ఉన్నాము మనము. అన్ని అందుబాటులో ఉంటే జీవితం విలువ తెలియదు అని మన పెద్దలు మొదటి నుంచే చెపుతూ ఉంటారు. ఆది నిజం. ఈ రోజు చిన్న చిన్న పిల్లలు కూడా జీవితం వ్యర్ధం అనో, ఇంకా ఈ బ్రతుకు బ్రతకలేను అనో, అనుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రోజు పేపర్ చూసినా, వార్తలు విన్న ఎక్కడో అక్కడ ఇలాంటి వార్త లే వింటున్నాము. ప్రాణం తీసుకోవటం ఎంత తేలికో ప్రాణం నిలపెట్టటం అంత కష్టం. క్షాణికావేశానికి లోను అయ్యీ తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే అనర్ధాలు ఇవి. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని చనిపోతున్నారు. మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు వాళ్ళ ప్రతిభ కి. కానీ ఈ రోజున వాటినే చూస్తూ వాటి గురించే చదువుతూ అవి ఏ మాత్రం తగ్గినా వెర్రి ఆలోచనలతో చనిపోతున్నారు చిన్న పిల్లలు. అలా చనిపోయిన వాళ్ళదే తప్పు కాదు, ఆ పరిస్థితి కల్పించిన వారి అందరిది. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి మార్కులు తక్కువ వస్తే మొహం ఎత్తుకుని బ్రతకలేము అని అనుకుంటారు తప్ప వాళ్ళకి ఎందుకు తక్కువ వచ్చాయి అనే దాని గురించి ఆలోచించారు. ఏదో ఒక ట్యూషను పెట్టటం, ఎక్కువ డబ్బులు తీసుకునే కాలేజ్ లో చేర్పించటం, ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని పిల్లల మీద రుద్దటం. నిజంగా పిల్ల వానికి చదువుకోవాలి అనే కోరిక ఉంటే అన్ని చెయ్యవచు. అందుకు వాళ్ళు కూడా సిద్దం గానే ఉన్నారు. కానీ అందరు పిల్లలు ఒకే లా ఉండరు. కొందరికి చదువు అంత గా నచ్చదు, ఆటల మీద ఆశక్తి ఉంటుంది, వేరే రంగం లో రాణించాలని ఉంటుంది. అలాంటి పిల్లలిని ఎంత కష్టపెట్టినా ఫలితం ఉండదు. వారి మనసు తెలుసుకుని వారికి ఇష్టం ఉన్న దాంట్లో ఉంచితే వారు తేలికగా అందులో కూడా మంచి పేరు తెచ్చుకోగలరు.
ఇక ఇంకో రకమిన పరిస్థితి. ఈ మధ్య మన దేశం లో మన పెద్దలు ఎవరు చూడని డబ్బు ఈ తరం వాళ్ళకి అందుబాటు లో ఉంటుంది. IT వల్ల అందరికి పెద్ద పెద్ద జీతాలు, వాటికి తగ్గట్టుగానే కోరికలు. ఆ కోరికలు కూడా కష్టాలకి మూలం. మన IT అంత అమెరికా తుమ్మితే ఊడి పోయే రకం. అమెరికాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర లో IT బాగు పడటానికి చాలా రోజులు పడుతుంది, మళ్లీ తిరిగి పాత రోజులు మాత్రం తిరిగి రావు అన్నడి మాత్రం సత్యం. IT నే మనకి పెద్ద పరిశ్రమ కూడా. కానీ అందులో ఉద్యోగం రాలేదనో ఉన్న ఉద్యోగం పోయింది అనో చని పోతున్నవారు కూడా ఎక్కువ అయ్యారు ఈ మధ్య. నిజం చెప్పాలి అంటే అలాంటి వాళ్ళు బతకటం కష్టం కాదు. మన సమాజం లో బ్రతకటానికి కావలసిన చదువు వారి దగ్గర ఉంది. కావలసింది కొంచం ఓర్పు, సహనం. మనం ఇన్ని రోజులు పట్టించుకొని మార్గాలు చాలా ఉన్నాయి మన చదువు కి మంచి గౌరవం ఇచ్చి బ్రతకటానికి కావలసినంత డబ్బులు ఇవ్వటానికి. ఇప్పుడు చాలా ఇంజనీరింగు కాలేజ్ లు వచ్చాయి. అందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక పై చదువు లు చదవ వచ్చు, MS,PHD లాంటివి చేస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకమైన జాబ్ దొరుకుతుంది. కావలసింది మన గట్టి ప్రయత్నం, ఓపిక, సహనం. చనీపోదాం అనుకునే ముందు మన తల్లితండ్రులని ఒక్క సారి తలుచుకోవాలి. ఎంత కష్ట పడి, ఉన్నప్పుడు తిని లేనప్పుడు కూడా మనకే పెట్టి ఇంత పెద్ద వల్ల ని చేసిన వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటున్నారో.
ఇంకో రాకమైన పిచ్చి. ఈ రోజుల్లో ప్రేమ విఫలం అయ్యీ చనిపోవటం, ప్రేమించామని బలవంత పెట్టినందుకూ చనిపోవటం, పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారు అని, తాను ప్రేమించన వాడు/ఆమె వేరే వాళ్ళ తో చనువు గా ఉంది అని ఇలా పనికి మాలిన కారణాల వల్ల చనిపోతున్నారు. ప్రేమించటం అనేది తప్పు కాదు కానీ ఆది మొదలు అయ్యే ముందు దాన్ని పర్యవసానాలు ఆలోచించుకోవాలి. అన్ని మనం అనుకూనట్టు జరగవు. దేనికినా రెండవ ప్లాన్ ఉండాలి. అంతే కానీ ఆత్మహత్యలకి పాలు పడటం ఎంత తప్పో ఆలోచించాలి. అలాంటి తప్పుడు ఆలోచన రాగానే ఒక మానసిక వైద్యుడిని కలవండి. అలాంటి ఆలోచనలు అన్ని మనల్ని శాశిస్తాయి. కానీ వాటిని అదుపు చెయ్యటం వాళ్ళకి తెలుసు అలాగే ఒక మంచి పని కి శ్రీకారం చుట్టండి. మీ పక్క వారికి కొంచమయినా సహాయం చెయ్యటం, చదువు లేని వాళ్ళకి మీకు తెలిసింది నేర్పించటం, మీ పెద్దలతో కుదిరినంత సమయం గడపటం, ఎవరితో ఒకరితో మీ మనుసు పంచుకోవటం, మీ బాధలు అన్ని విని మంచి సలహా ఇవ్వగలిగే వాళ్ళకి చెప్పి వారి సలహాలు పాటించటం, దైవ కార్యక్రమాలు చెయ్యటం ఇలా ఏదెనా సరే.
మనిషి గా పుట్టాటం ఒక అదృష్టం, దానిని మంచిగా జీవించటం మన కర్తవ్యం...
ఒక్క సారి ఆలోచించండి..........
2 comments:
చాలా బాగా రాశారండీ.
mee blog chaalaa bagundi kocham teerigga vivaramaina vimarsh chestaanu....Iam Raki , a telugu lyric writer pl. visit
my blogs for telugu songs and naaneelu daily latest postings and give your comments and accept me as your friend www.raki9-4u.blogspot.com www.rakigita9-4u.blogspot.com
Post a Comment