Monday, August 10, 2009

కనువిప్పు.......

ఒక మధ్య తరగతి కుటుంభం నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగం లో ఉన్నాడు కొడుకు. అతను ఆ పొసిషన్ లో ఉండటానికి అతని తల్లి తండ్రులు పడ్డ శ్రమ అతను ఎప్పుడు మార్చిపోలేదు. అతను ముంబై లో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు అతనిని, మనవలని చూడటానికి అతని తల్లి తండ్రులు ముంబై వెళుతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా రైలు లో వెళ్లే వారు. ఒకసారి కొడుకు వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ పంపించాడు తన దగ్గరికి రావటానికి వాళ్ళకి. అంతే అవి అందుకున్న వాళ్ళు చిన్న పిల్లల లాగా ఆనందించారు. మొదటి సారి ఫ్లైట్ ఎక్క బోతున్నందుకు. వెళ్ళటానికి ఇంకా 15 రోజులు ఉన్నా అవి అందిన రోజు నుంచే ఒక రాక మైన ఆనందం వాళ్ళకి. తమ స్నేహితులకి చెప్పుకున్నారు తమ కొడుకు ఫ్లైట్ టికెట్ లు పంపించాడు అని. రోజులు దగ్గరికి వస్తున్న కొద్ది ఆరాటం పెరగ సాగింది. అన్ని సర్ధుకోవటం, మనవాళ్ళకి చిరుతిండ్లు చెయ్యటం, కొడుకు కోడలికి కావలసినవి తీసుకోవటం. వాళ్ళు ప్రయాణం చేసే రోజు రానే వచింది. ఆ రోజు ఉదయం నుంచే చిన్న పిల్లలి లాగా హుషారు గా అన్ని పనులు పూర్తి చేసుకుని ఫ్లైట్ టైమ్ ఇంకా మూడు గంటలు ముందే ట్యాక్సీ తీసుకుని ఏర్‌పోర్ట్ కి బయలుదేరారు. మధ్య లో వీళ్ళ ఫోన్ కి ఒక sms వచింది ఫ్లైట్ 3 గంటలు లేటు అని. కొంచం నీరస పడ్డారు. కానీ వెనకకి వెళ్ళటం ఇష్టం లేక ఏర్‌పోర్ట్ కి వెళ్లారు. ఆది కొత్త ప్రపంచం వాళ్ళకి. లోపలకి వెళ్ళటం అదే మొదటి సారి. అన్నిటినీ వింత గా చూడసాగరు. ఆ మూడు గంటలు సమయం కూడా ఎలా గడిచిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కే సమయం వచింది. వాళ్ళు మొదటి సారి ఫ్లైట్ లో కి అడుగు పెట్టగానే కంగారు, ఆనందం. హైదరాబాదు నుంచి ముంబై కి 45 నిమిషాలు ప్రయాణం. కానీ వాళ్ళు ప్రతి నిమిషానిని ఆనందించారు. ఫ్లైట్ ముంబై లో ఆగగానే సామనులు తీసుకుని బయటకి వచ్చారు. అక్కడ తమ కొడుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అతనిని చూడగానే దగ్గరికి వచ్చి కావలించుకుని థాంక్స్ చెప్పారు ఇద్దరు. అతనికి అర్ధం కాలేదు ఎందుకో. అదే అడిగితే వాళ్ళ కల తీర్చినందుకు అన్నారు. కొడుకు ఆనందక పడక పోగా తాను ఇన్ని రోజులు చేసిన తప్పు కి సిగ్గు పడ్డాడు.

కొడుకు మంచి ఉద్యోగం లో ఉన్నాడు. తాను ఉద్యోగం పేరు తో ఎన్నో సార్లు ఫ్లైట్ ఎక్కాడు. బయటి ప్రపంచం చూసాడు. ముంబై లో మంచి జీవితం. పిల్లలు మంచి స్కూలు లో చదువుతున్నారు. అతనికి కారు. ఇంత మంచి జీవితం అతని తల్లి తండ్రులు పడ్డ శ్రమ వాళ్ళ కష్టం. తనకి చిన్నప్పటి నుంచి ఏది కావాల్లన్న తాను అడగకుండా నే అన్ని తీర్చే వారు. తనకి మంచి చదువు చెప్పించటానికి వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. తనకి మంచి ఉద్యోగం వస్తే అతని నుంచి ఏమీ ఆశించకుండా కుదిరితే వాళ్లే అతనికి ఏది కావాలంటే ఆది పంపించే వారు. అలా గాని కొడుకు తల్లి తండ్రులని తక్కువ చేసి చూడలేదు. కానీ అలా అతనికి తమ కోరిక తీర్చినందుకు థాంక్స్ చెప్పే సరికి కొంచం బాధ పడ్డాడు. తాను సంపాదిస్తున్న దాని తో ఈ పని ఎప్పుడో చేయగలడు కానీ టికెట్స్ తక్కువ కి వస్తున్నాయి అన్న ఒక్క పేరు తో వాళ్ళకి ఆ ఫ్లైట్ టికెట్ లు పంపాడు. కానీ తాను చేసిన తప్పు అర్ధం అయ్యింది. తన తల్లి తండ్రులు తనకోసం ఎన్నో త్యాగాలు చేస్తే తాను మాత్రం ఇంత సంకుచితం గా ఆలోచించాడు. వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. పెద్దవి కాక పోవచు. కానీ వాటిని తీర్చటం తన ధర్మం. వాటికి ఎంత డబ్బు కర్ఛు అయినా పర్వాలేదు. ఇక మిగిలిన రోజులు వాళ్ళు సుఖం గా ఉండాలి. అందుకే అక్కడే ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఇంకా ఇష్టమైన ఊటీ, కన్యాకుమారి ట్రిప్ కి వెళ్ళబోతున్నారు అని చెప్పాడు వాళ్ళకి.

ఇంకా కొన్ని బ్లోగుల కోసం చూడండి.

http://www.naaabhiprayaam.blogspot.com

Monday, August 3, 2009

స్వచ్చమైన ప్రేమ...

ఒక తండ్రి తన కొత్త కారు ని కడుగుతూ ఉన్నాడు. అతని దగ్గరికి అతని మూడు సంవత్చరాల కొడుకు వచ్చి అతని పని ని పాడు చెయ్యకుండా తండ్రికి అన్ని అందిస్తూ అతని పనిలో సహాయం చేస్తూ ఉన్నాడు. కొంచం సేపు అయ్యాక తండ్రి వేరే పని లో పడిపోయాడు. కొడుకుని పట్టించుకోలేదు. కొంచం సేపు అయ్యాక ఆ తండ్రి కొడుకు ఏమీ చేస్తున్నాడో అని చూడటానికి వచ్చే సరికి ఆ పిల్ల వాడు ఒక చిన్న పదునయిన వస్తువు తీసుకుని కారు మీద ఏదో రాస్తూ కనపడ్డాడు. అసలే కొత్త కారు అందులో చాలా మోజు పడి కొనుక్కున్నది, అంతే తండ్రికి పట్టరాని కోపం వచ్చి చేతికి ఏదో అందినది తీసుకుని కొడుకుని కొట్టాడు. ఆ దెబ్బ కి కొడుకు చేతికి తగిలి రక్తం రాసాగింది. తండ్రికి తాను చేసిన తప్పు తెలిసి హడావిడిగా కొడుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి కొడుకు వి రెండు వెళ్లు విరిగి పోయాయి, వాటిని తీసేయ్యాలి అని చెప్పారు. తండ్రి బాధ తట్టుకోలేక ఏడుస్తూ కూర్చున్నాడు. డాక్టర్లలని వెడుకున్నాడు వేరే ఏది అయినా మార్గం ఉంటే దానితో తన కొడుకు వెళ్లు బాగు చెయ్యమని. కానీ వేరే మార్గం లేక డాక్టర్లు ఆ బాబు వెళ్లు తీసి వేశారు. తండ్రికి బాధ కలిగి తాను అంత రాక్షసుడిలా మారటానికి కారణం అయిన కారు దగ్గరికి వెళ్లాడు. అసలు తన కొడుకు ఏమీ చేసాడో కూడా చూడలేదు కొడుకుని కొట్టెముందు. అక్కడికి వెళ్ళి కరుని చూసి మూర్చ పోయాడు. మళ్లీ ఈ లోకం లో కి వచ్చి ఆది చూసి భోరున ఏడవటము మొదలు పెట్టాడు. ఆ ఏడుపు ఆపటము ఎవరి వల్ల కాలేదు. ఆ కారు మీద తన కొడుకు రాసినది.....

"ఈ లవ్ యూ డాడ్" / "I love you DAD"